Pawan Kalyan: చిరు.. గాడ్ ఫాదర్ సీన్ ను రిపీట్ చేసిన పవన్ కళ్యాణ్!
- November 5, 2022 / 12:53 PM ISTByFilmy Focus
జనసేన అధినేత, అభిమానులు పవర్ స్టార్ గా పిలుచుకునే పవన్ కళ్యాణ్… గట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆయన సినిమాల్లోనూ హీరోనే..నిజ జీవితంలోనూ హీరోనే..! జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ఆయన చేస్తున్న కృషి వర్ణనాతీతం. అధికార పార్టీ పవన్ కళ్యాణ్ ను చిత్ర హింసలు పెడుతుంది. ఆయన సినిమాలు వస్తే టికెట్ రేట్లు తగ్గించేస్తుంది. సినీ పరిశ్రమ పై కక్ష కడుతుంది. ఇక రాజకీయాల పరంగా అతనికి ఎవరైనా మద్దతు పలికితే వారిని కూడా టార్గెట్ చేసి ఆర్థికంగా, వ్యక్తిగతంగా దాడి చేస్తుంది.
తాజాగా ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీకి సాయం చేసిన జనాల ఇళ్లను రోడ్డు విస్తీర్ణం పేరు చెప్పి కూల్చడానికి రెడీ అయ్యింది. దీంతో తన వల్ల నష్టపోయిన జనాలను కలిసి ధైర్యం చెప్పడానికి పవన్ కళ్యాణ్ వెళ్తుంటే.. ప్రోటో కాల్ పేరు చెప్పి ఆయన వాహనాలను పోలీసులు నిలిపివేసే ప్రయత్నం చేశారు. అయినా పవన్ కళ్యాణ్ తగ్గకుండా కాలి నడకన ముందుకు సాగాడు. దీంతో జనాలు, అభిమానులు ఆయన వెంట సైన్యంలా వెళ్ళారు.

ఇది ఇటీవల చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో సన్నివేశాన్ని గుర్తుచేసింది. అందుకే దీని పై స్పెషల్ మీమ్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. డైలాగ్ అన్నది యాక్షన్ తమ్ముడిది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆ వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి:
#JanaSenaWithIppatam #Pawankalyan #ippatamvillage pic.twitter.com/3PjidNmw51
— Durgasi Sekhar (@DurgasiSekhar) November 5, 2022
ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

















