సినిమా మొదలయ్యేది అప్పుడే.. కానీ?

‘సైరా’ చిత్రం పూర్తయిన వెంటనే కొరటాల శివ డైరెక్షన్లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇది మెగాస్టార్ కు 152 వ చిత్రం. ‘మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్’ ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ బ్యానెర్ల పై ఈ చిత్రం రూపొందనుందీ. నిజానికి ఏప్రిల్ లోనే ప్రారంభం కావాల్సిన ఈ చిత్రం ‘సైరా’ షూటింగ్ పూర్తికాకపోవడంతో హోల్డ్ లో పెట్టారు. ఇప్పుడు ‘సైరా’ షూటింగ్ పూర్తయింది.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక కొరటాల చిత్రం ఆగష్టు 22 న మెగాస్టార్ పుట్టినరోజు కావడంతో… లాంఛనంగా ప్రారంభిస్తారని సమాచారం. అయితే ఆరోజు పూజా కార్యక్రమాలను మాత్రమే నిర్వహిస్తారు.

రెగ్యూలర్ షూటింగ్ మాత్రం నవంబర్ నుండీ ప్రారంభిస్తారని సమాచారం. ‘సైరా’ చిత్రం అక్టోబర్ 2 న విడుదల చేస్తారు కాబట్టి ఎలాగూ ప్రమోషన్స్ తో చిరు అలాగే నిర్మాత చరణ్ బిజీగా ఉంటారు. అందుకే నవంబర్ నుండీ ప్రారంభించాలని భావిస్తున్నారట. 2020 ఉగాదికి చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. గ్రామీణ నేప‌థ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుందట. ప‌లాస‌, శ్రీకాకుళం వంటి ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతారని టాక్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus