ఇంట్లో ఆడపిల్ల పెళ్లి అంటే.. ఆ సందడే వేరు..! అలాంటిది మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరో ఇంట్లో పెళ్లి అంటే ఆ సందడి ఏ రేంజ్లో ఉంటుంది. ఇద్దరు తమ్ముళ్ల పిల్లలు వారితో పాటు సోదరీమణుల పిల్లలు కూడా కలిసి పెరిగిన ఇంట్లో ఇక పెళ్లి సందడి ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోండి.! సరిగ్గా.. ఇప్పుడు కొణిదెల వారింట్లో.. అదే మన మెగా ఫ్యామిలీలో కూడా అలాంటి సందడే నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు కూతురు అయిన నిహారిక పెళ్లి కోసం..
తమ సినిమా షూటింగ్లను పోస్ట్ పోన్ చేసుకుని ఇప్పటికే ఉదయ్ పూర్ చేరుకున్నారు మెగాహీరోలు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక నిహారిక కు బహుమతులు కూడా భారీగా అందుతున్నాయి. తన తండ్రి నాగబాబు అలాగే అన్న వరుణ్ తేజ్.. కోట్ల రూపాయలు విలువ చేసే గిఫ్ట్ లు ఇచ్చారట. ఇక నిహారిక పెదనాన్న చిరంజీవి కూడా కోటిన్నర విలువ చేసే వస్తువుని బహుమతిగా ఇప్పించారట.
అంతేకాదు అల్లుడు చైతన్య కు కూడా అదే రేంజ్లో బహుమతి ఇచ్చారట. అంతేకాకుండా భవిష్యత్తులో తనకి హీరో అవ్వాలి అనిపిస్తే.. అందుకు మెగాస్టార్ తనవంతు సప్పోర్ట్ ఇస్తానని కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక సాయి తేజ్ కుటుంబం అలాగే అల్లు వారి కుటుంబం కూడా నిహారికకు కోట్లు విలువ చేసే బహుమతులు అందించినట్టు స్పష్టమవుతుంది.