Chiranjeevi: బారసాల వేడుకకు వచ్చిన అతిథుల కోసం చిరంజీవి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?

మెగా ఇంట్లో గత కొద్దిరోజులుగా అన్ని శుభాలే జరుగుతూ వస్తున్నాయి. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందడం ఉపాసన తల్లి కావడం వరుణ్ తేజ్ పెళ్లి ఫిక్స్ అవడం ఇలా మెగా కుటుంబంలో వరుసగా శుభవార్తలు వింటూ ఉన్నాము. ఇక ఉపాసన రాంచరణ్ దంపతులకు జూన్ 20 తేదీ ఆడబిడ్డ జన్మించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ చిన్నారి బారసాల వేడుకను శుక్రవారం చిరంజీవి నివాసంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిపించారు.

ఇలా తమ చిన్నారికి బారసాల వేడుకను జరపడమే కాకుండా తమ చిన్నారికి నామకరణం కూడా చేశారు. ఈ క్రమంలోనే మెగా ప్రిన్సెస్ కు క్లిన్ కారా కొణిదెల అనే నామకరణం చేశామని ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ సోషల్ మీడియా వేదికగా మెగా ప్రిన్సెస్ పేరును రివిల్ చేశారు. అలాగే చిన్నారి బారసాల వేడుకకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి.

చిన్నారి పేరును లలిత సహస్రనామాల నుంచి తీసుకున్నామని ఉపాసన వెల్లడించారు. ఇకపోతే తాజాగా బారసాల వేడుక కోసం వచ్చినటువంటి అతిథులకు చిరంజీవి సర్ప్రైజింగ్ గిఫ్ట్ లు ఇచ్చారని తెలుస్తోంది. ఈ బారసాల వేడుకకు హాజరైనటువంటి వారందరికీ రిటర్న్ గిఫ్ట్స్ లో భాగంగా ఒక పట్టు చీరతో పాటు గాజులు అలాగే ఒక గోల్డ్ కాయిన్ రిటర్న్ గిఫ్ట్ చేశారని తెలుస్తోంది.

ఇలా ఈ వేడుకకు హాజరైనటువంటి మహిళలందరికీ ఇలాంటి రిటర్న్ గిఫ్ట్ అందజేశారు అంటూ ఇండస్ట్రీ సమాచారం. ఇక రామ్ చరణ్ ఉపాసన దంపతులకు పెళ్లైన 11 సంవత్సరాలకు పాప జన్మించడంతో చిన్నారికి సంబంధించిన ప్రతి వేడుకను కూడా చాలా ఘనంగా చేయాలన్న ఉద్దేశంలో మెగా ఫ్యామిలీ ఉన్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే చిన్నారి బారసాల వేడుక కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సమాచారం.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus