Chiranjeevi: ఏడాది పాటు తన ఇంట్లోనే ఆ హీరోకి ఆశ్రయం ఇచ్చారంట..!

  • September 27, 2023 / 02:27 PM IST

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి, తన సొంత కష్టం తో మెగాస్టార్ గా ఎదిగి కోట్లాది మంది అభిమానులకు ఆదర్శప్రాయంగా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తల్లో ఆయన పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అలా కష్టం విలువ తెలుసు కాబట్టే, కష్టాల్లో ఉన్న వారికి ఎల్లప్పుడూ అభయ హస్తం అందిస్తూ ఉంటాడు. తన తోటి స్టార్ హీరోలను సోదర సమానులుగా చూడడం, తన కంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని ప్రోత్సహించడం,

కొత్తగా ఇండస్ట్రీ కి వచ్చి టాలెంట్ ని నిరూపించుకున్న వారికి అండగా నిలబడడం, అలాగే అవకాశాలు లేక తినడానికి త్రింది కూడా లేక ఇబ్బంది పడుతున్న కొంతమంది క్యారక్టర్ ఆర్టిస్టులకు సహాయం చెయ్యడం. ఇలాంటి ఎన్నో గొప్ప పనులు చేసాడు కాబట్టే అందరూ ఆయనని ఇండస్ట్రీ పెద్ద అని పిలుస్తూ ఉంటారు. అలా ప్రముఖ హీరో , ప్రస్తుత బిగ్ బాస్ కంటెస్టెంట్ శివాజీ కి కూడా ఎన్నో సహాయాలు చేసాడట (Chiranjeevi) మెగాస్టార్.

ఒకానొక సమయంలో శివాజీకి డబ్బులు లేక, ఇంటి అద్దె కూడా కట్టుకోలేని దీనమైన దుస్థితి వచ్చింది. ఆ సమయం లో ఆయన చిరంజీవి తో కలిసి ఇంద్ర సినిమా లో నటించాడు. శివాజీ కష్టం తెలుసుకున్న చిరంజీవి, అతని షూటింగ్ పార్ట్ పూర్తి అయ్యే వరకు తన ఇంట్లోనే ఉంచుకున్నాడు అట. ఆ తర్వాత షూటింగ్ అయిపోయాక శివాజీ తిరిగి ఇంటికి వెళ్తున్న సమయం లో చేతిలో 10 వేల రూపాయిలు పెట్టి, ఇంటి అద్దె కట్టడానికి ఇబ్బంది పడుతున్నావ్ అని విన్నాను, ఈ డబ్బులు ఉంచుకో అని ఇచ్చాడట.

అలా ఏడాది పాటు శివాజీకి ఇంటి అద్దె చిరంజీవి కట్టేవాడట. ఈ విషయాన్నీ గతం లో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో శివాజీ చెప్పుకున్నాడు. ఆ క్షణం నుండి శివాజీ తనలాగా ఇబ్బంది పడుతున్న వారికి సహాయాలు చేస్తూనే వచ్చాడట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus