మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. వైరస్ మహమ్మారి విజ్రుంభిస్తున్న తరుణంలో ఈ చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభం కాలేదు. త్వరలోనే తిరిగి షూటింగ్ ప్రారంభించాలని ట్రై చేస్తున్నారు. సరే ఈ విషయాన్ని పక్కన పెడితే.. ‘ఆచార్య’ తరువాత ‘లూసిఫర్’ రీమేక్ లో నటించాలని చిరు భావించారు. ‘సాహో’ ఫేం సుజీత్ ను డైరెక్టర్ గా కూడా ఫిక్స్ చేసారు. కానీ అతను రెడీ చేసిన స్క్రిప్ట్ తో మెగాస్టార్ సంతృప్తి చెందలేదు.
దాంతో సుజీత్ ఈ ప్రాజెక్ట్ నుండీ తప్పుకుని.. మళ్ళీ ‘యూవీ క్రియేషన్స్’లో సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. అయితే ‘లూసీఫర్’ రిమేక్ బాధ్యతలను వినాయక్ కు అప్పగించాలని చిరు ప్లాన్ చెయ్యగా.. ‘ఆ సినిమా స్క్రిప్ట్ రెడీ చెయ్యడం కష్టం’ అని వినాయక్ చెప్పాడట. ‘ఆల్రెడీ తెలుగులో డబ్ అయిన సినిమా.. అందులోనూ ఈ లాక్ డౌన్ టైంలో చాలా మంది ‘లూసిఫర్’ ను చూసేసారు’ అనేది వినాయక్ వాదన. చిరు కూడా వినాయక్ మాటలతో కొన్నాళ్ళు ఆలోచనలో పడినప్పటికీ..
‘వినాయక్ అయితే తప్ప ఈ ప్రాజెక్ట్ ఎవ్వరూ హ్యాండిల్ చెయ్యలేరు’ అని మళ్ళీ అతన్ని సంప్రదించారని తెలుస్తుంది. చిరుతో సినిమా చెయ్యడానికి వినాయక్ రెడీ అంటున్నాడు కానీ ‘లుసిఫర్’ రిమేక్ మాత్రం వద్దు అని అతని రిక్వెస్ట్. అయినప్పటికీ ‘ఠాగూర్’ మరియు ‘ఖైదీ నెంబర్150’ చిత్రాల రీమేక్ ల టైంలో వినాయక్ తో చేసిన డిస్కషన్స్ ను చిరు గుర్తు చేసి అతన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం . చూడాలి మరి చివరికి ఏమవుతుందో..!
Most Recommended Video
పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?