రాఘవేంద్ర రావు యూట్యూబ్ ఛానల్ లాంఛ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు గతకొద్ది కాలంగా సినిమాలేవీ డైరెక్ట్ చేయడం లేదు కానీ మారుతున్న కాలానికనుగుణంగా.. ఇప్పటి ఫిలిం మేకర్లతో పోటీపడుతూ.. ఇప్పటి ఆడియన్స్ ఆలోచనలను, అభిరుచులను అర్థం చేసుకుని.. న్యూ టాలెంట్‌ని ఎంకరేజ్ చేయాలని.. కొత్త వారికి అవకాశం కల్పిస్తూ.. సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించనున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే..

తన ఛానల్‌కి ‘కేఆర్ఆర్ వర్క్స్’ అనే పేరు పెట్టారు.. తాజాగా ఈ ఛానల్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభమైంది.. మ్యూజిక్ వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్.. లెజెండ్ రాఘవేంద్ర రావు గురించి స్టార్ హీరోయిన్స్ చెప్పిన ముచ్చట్లు.. స్టార్ డైరెక్టర్స్ బుక్ లాంఛ్.. సౌందర్య లహరి గ్లింప్స్ వంటివన్నీ వీడియోలో చూపించారు..

మెగాస్టార్ చిరంజీవి.. రాఘవేంద్ర రావుతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.. సినీ పరిశ్రమలో ఎంతో అనుభవాన్ని గడించిన రాఘవేంద్ర రావు.. ఈ ‘కేఆర్ఆర్ వర్క్స్’ అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి, కొత్త వారిని ప్రోత్సహించాలనుకోవడం అభినందనీయం.. అంటూ చెప్పుకొచ్చారు చిరు..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus