టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా నెంబర్ వన్ హీరోగా ఇండస్ట్రీని ఏలిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తున్నాడు. ఒకపక్క ఆచార్య సినిమా షూటింగ్ లో పార్టిసిపేట్ చేస్తూనే మరోపక్క సినిమాలపై సినిమాలు ఎనౌన్స్ చేస్తున్నాడు. అయితే, వీటిలో ఎనౌన్స్ చేసినవన్నీ దాదాపుగా రీమేక్ సినిమాలే ఉండటం ఇప్పుడు ఫ్యాన్స్ ని కలవర పరుస్తోంది. ఆచార్య సినిమా తర్వాత డైరెక్టర్ మోహన్ రాజా తో కలిసి లూసిఫర్ రీమేక్ సెట్స్ లో పాల్గొంటున్నాడు చిరు. ఈ సినిమాతో పాటుగానే వేదాళం రీమేక్ ని కూడా లైన్లో పెట్టేశాడు. దీనికి డైరెక్టర్ మెహర్ రమేష్ అని కూడా చెప్పాడు. ఇక్కడి వరకూ కథ బాగానే ఉంది. కానీ, ఇప్పుడు మెహర్ రమేష్ లాంటి ఫ్లాప్ డైరెక్టర్ కి అవకాశం ఎందుకిచ్చాడు అన్నయ్యా .. అంటూ ఆరాలుతీస్తున్నారు అందరూ.
అస్సలు ఫామ్ లోనే లేని డైరెక్టర్, అందులోనూ లైమ్ లైట్ లో లేని డైరెక్టర్ కి పెద్ద ప్రాజెక్ట్ ని అప్పజెప్పడంపై ఆందోళన చెందుతున్నారు. నిజానికి మెగాస్టార్ కమ్ బ్యాక్ మూవీ 150వ సినిమాకి సినిమాకి ఎంతోమంది డైరెక్టర్స్ ని అనుకున్నారు. చివరకి వినాయక్ తో కలిసి కత్తి రీమేక్ చేశాడు మెగాస్టార్. అది బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్ అయ్యింది. అందులో పాటలు ఇప్పటికీ సూపర్ హిట్టే. అయితే, ఇప్పుడు చేయబోతున్న ఆచార్య సినిమా స్ట్రయిట్ సినిమా కాబట్టి కథానేపథ్యం ఎలా ఉంటుందా అని ఆశగా చూస్తున్నారు ఫ్యాన్స్. కానీ, తర్వాత వచ్చే సినిమాలు అన్నీ రీమేక్ సినిమాలే అయితే ఎంతమంది చూస్తారు అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది.ఇక డైరెక్టర్ బాబీతో కూడా ఒక సినిమా కమిట్ అయ్యాడు మెగాస్టార్. ఈ సినిమాతో పాటుగా మరో రీమేక్ ని కూడా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. అది కూడా ఫామ్ లో లేని శ్రీనువైట్లతో ఈసినిమాకి కమిట్ అయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదికూడా అజిత్ నటించిన తమిళ్ సినిమా తెలుగులో ఎంతమంచివాడవురా రీమేక్ అనే అంటున్నారు. ఇప్పటికే భాషాభేదం లేకుండా ఓటీటీల్లో సినిమాలని చూస్తున్న సినీ ప్రేమికులు ఈ సినిమాలని ఎప్పుడో చూసేశారు కూడా. మరి మెగాస్టార్ చిరంజీవి ఈసినిమాతో కొత్తగా చెప్పేది ఏముంటుందని, ఆల్రెడీ వచ్చిన స్టోరీనే మళ్లీ ఏం చేస్తారని అంటున్నారు విమర్శకులు. అంతేకాదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రీమేక్స్ తట్టుకోలేకపోతుంటే, అందులోనూ ఫ్లాప్ డైరెక్టర్స్ కి అవకాశం ఇవ్వడం అవసరమా అని అంటున్నారు. మెగాస్టార్ డేట్స్ ఇవ్వాలే కానీ, కుర్ర డైరెక్టర్స్ చాలామంది లైన్లో ఉన్నారు. అలాగే స్టార్ డైరెక్టర్స్ కూడా మెగాస్టార్ పిలుపుకోసం కథలతో వెయిట్ చేస్తున్నారు. మరి వీళ్లందరినీ కాదని మెగాస్టార్ చిరంజీవి ఇలా రీమేక్స్ చేస్తూ ఫ్లాప్ డైరెక్టర్స్ ని ఎంకరేజ్ చేయడం ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. మరి చూద్దాం.. ఏ పుట్టలో ఏ పాము ఉందో అనేది. అదీ విషయం.
Most Recommended Video
పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!