మెగా 154 : ఊర మాస్ అవతార్ లో చిరు.. పిక్ వైరల్..!

మెగాస్టార్ చిరంజీవి ఇప్పటి స్టార్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నారు. ఈ ఏడాది ఆల్రెడీ రెండు సినిమాలు రిలీజ్ చేశారు. అందులో ఒకటి ‘ఆచార్య’ కాగా మరొకటి ‘గాడ్ ఫాదర్’. ఇందులో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ‘ఆచార్య’ ప్లాప్ గా మిగిలింది. అయితే ఎటువంటి అంచనాలు కానీ ప్రమోషన్లు కానీ లేకుండా రిలీజ్ అయిన ‘గాడ్ ఫాదర్’ మాత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేకపోతోంది.

ప్రమోషన్లు బాగా చేసి ఉంటే ఈ మూవీ రిజల్ట్ మరోలా ఉండేదేమో. ఇప్పటికైతే కమర్షియల్ ఫెయిల్యూర్ గా మిగిలే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. దసరాకి ‘గాడ్ ఫాదర్’ గా ప్రేక్షకులను పలకరించిన చిరు.. 2023 సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ‘పవర్’ ‘జై లవ కుశ’ ‘వెంకీ మామ’ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన బాబీ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ మూవీలో రవితేజ కూడా ఓ కీలక పాత్ర పోషించనున్నాడు. ఈ చిత్రం విక్రమ్ మూవీలానే సినిమాటిక్ యూనివర్స్ కాన్సెప్ట్ తో రూపొందుతుందని వినికిడి.

ఈ చిత్రంలో చిరు స్మగ్లింగ్ చేసే ఫిషర్ మెన్ గా కనిపించబోతున్నారట. ఇక చిరుని పట్టుకుని జైల్లో పెట్టాలని పరితపించే పాత్రలో రవితేజ కనిపిస్తారని వినికిడి. ఈ మూవీలో చిరు ఊర మాస్ లుక్ లో కనిపించబోతున్నారు. మరీ ముఖ్యంగా ఆయన వింటేజ్ లుక్ లో కనిపిస్తారని చాలా కాలం నుండి ప్రచారం జరుగుతుంది. దానిని నిజం చేస్తూ సోషల్ మీడియాలో ఓ పిక్ వైరల్ అవుతుంది. ఇందులో చిరు ‘ఘరానా మొగుడు’ సినిమాలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్ హాట్ టాపిక్ అయ్యింది.

1

2

3

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus