మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ 40శాతం కంప్లీట్ అయ్యింది. అయితే కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఈ నెలాఖరు నుండీ ఈ చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని టాక్. సరే.. ఈ విషయాన్ని పక్కన పెడితే.. దర్శకుడు కొరటాల శివ సినిమాల్లో నటించే ప్రతీ హీరో అభిమానులను ఆకట్టుకునే మాస్ ఎలిమెంట్స్ కచ్చితంగా ఉంటాయి.
కానీ ఆయన కామెడీకి చాలా దూరంగా ఉంటూ ఉంటాడు. ఒక్క ‘మిర్చి’ సినిమాలో తప్ప కొరటాల తరువాతి సినిమాల్లో కామెడీ పెద్దగా కనిపించదు. ‘కామెడీని బలవంతంగా ఇరికిస్తే ప్రేక్షకులు.. సినిమా థీమ్ నుండీ డైవర్ట్ అవుతారని’ కొరటాల గతంలో చెప్పుకొచ్చాడు. ‘సిట్యుయేషన్ పరంగా కామెడీ అలా వచ్చి వెళ్ళిపోవాలి తప్ప.. దాని కోసం ట్రాక్ లు రాయడం ఇష్టం ఉండదు’ అని కూడా ఆయన తెలిపాడు. అయితే ఇప్పుడు ‘ఆచార్య’ చిత్రం విషయంలో మాత్రం..
కచ్చితంగా కామెడీ ఉండాలని చిరు.. కొరటాలను ఆదేశించారట. ఈ విషయంలో కొరటాల ఆలోచనలో పడినట్టు తెలుస్తుంది. నిజానికి మెగాస్టార్ సినిమా అంటేనే కచ్చితంగా కామెడీ ఉండాలని ఆయన అభిమానులు కూడా కోరుకుంటారు. ‘సైరా’ చిత్రంలో అది మిస్ అయ్యింది కాబట్టి.. చిరు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?