చిరు లీక్ చేశారు కానీ… అనౌన్సుమెంట్ ఇవ్వలేదేంటబ్బా..!

మెహర్ రమేష్ డైరెక్షన్లో ‘వేదాలం’ రీమేక్ చేస్తున్నట్టు ఆ చిత్రం గురించి అధికారిక ప్రకటన రాకముందే.. మెగాస్టార్ చిరంజీవి.. ‘బిగ్ బాస్4’ ఫైనల్ ఎపిసోడ్ కు గెస్ట్ గా వచ్చినప్పుడు లీక్ చేసేసారు. అంతేకాదు ఆ చిత్రంలో ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్ దివికి కూడా ఓ పాత్ర ఇవ్వబోతున్నట్టు కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంతా బానే ఉంది కానీ.. ఈ ప్రాజెక్టు గురించి ఇంకా దర్శకనిర్మాతలు అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. దసరా నుండీ ఈ ప్రాజెక్టు గురించి చర్చ జరుగుతుంది కానీ పూజా కార్యక్రమాలు వంటివి కూడా జరగలేదు.

‘ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. దాదాపు రూ.80 కోట్ల నుండీ రూ.90 కోట్ల బడ్జెట్ తో ఆయన ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారట. ఈ చిత్రం కోసం మెగాస్టార్ చిరంజీవి గుండుతో.. లుక్ టెస్ట్ కూడా చేయించుకున్నారు. ఆ ఫోటో కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది కూడా.! అయితే అనూహ్యంగా ‘లూసిఫర్’ రీమేక్ ను మొదలుపెట్టారు మెగాస్టార్ చిరంజీవి.

మోహన్ రాజా డైరెక్షన్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. దీంతో చిరు – మెహర్ ల ప్రాజెక్టు ఉంటుందా.. లేదా అనేదాని పై అనుమానాలు రేకెత్తాయి. అయితే ఈ ప్రాజెక్టు కచ్చితంగా ఉంటుంది అని చిరు సన్నిహితుల దగ్గరనుండీ సమాచారం. ఏప్రిల్ లో ఈ ప్రాజెక్టు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయట. ‘ఆచార్య’ ఫినిష్ అయిన వెంటనే ఈ ప్రాజెక్టు కూడా మొదలవ్వబోతుందని టాక్ బలంగా వినిపిస్తుంది.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus