వింత లుక్ లో దర్శనమిచ్చిన మెగాస్టార్ చిరంజీవి..ఫోటో వైరల్..!

Advertisement

అవును మన బాసు.. గుండు బాస్ గా మారాడు. లాక్ డౌన్ మొదలైన ప్రారంభంలో సోషల్ మీడియాకు ఎంట్రీ ఇచ్చిన మన మెగాస్టార్ చిరంజీవి..రక రకాల ట్వీట్స్ మరియు పాత ఫోటోలతో సందడి చేస్తున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఒకానొక సమయంలో మీసం తీసేసి కూడా దర్శనమిచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ‘ఇది సినిమా కోసమా’ అని కొందరు సెలబ్రిటీలు అడిగితే ‘జస్ట్ కొత్తగా ట్రై చెయ్యాలనిపించింది..

అంతే…! సినిమాల కోసం కాదు’ అంటూ మెగాస్టార్ చిరంజీవి బదులిచ్చారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఏకంగా గుండు ఫొటోలో దర్శనమిచ్చి అందరినీ షాక్ కు గురిచేశారు మెగాస్టార్. అయితే ఈ ఫోటో ఒరిజినల్ కాదు లెండి. ఫోటో షాపి అనే విధంగానే ఉంది. ‘భవిష్యత్తులో ఒక స్క్రిప్ట్ లో ఇలాంటి క్యారెక్టర్ కు ట్రయల్ గా మెగాస్టార్ చిరంజీవి ఈ లుక్ లో దర్శనమిచ్చినట్టు’ సమాచారం. దాంతో ఈ లుక్ ‘వేదాలం’ రీమేక్ కోసమే అని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఆ చిత్రంలో ‘ఆలుమ డోలుమ’ అనే క్యారెక్టర్ కు సంబంధించి అయ్యుండొచ్చు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఏదైతేనేం ఇప్పుడు ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఇక ‘వేదాలం’ రీమేక్ ను మెహర్ రమేష్ డైరెక్ట్ చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది.

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: బిగ్‌బాస్‌ ఇలా రోజూ అయితే కష్టమే!
బిగ్‌బాస్‌ 4: ఇంట్లో వాళ్లు ఒకరు… బయటి నుంచి ముగ్గురట!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus