Chiranjeevi: మెగాస్టార్ లైనప్.. బ్యాక్ టూ బ్యాక్ అప్డేట్స్!

  • August 6, 2021 / 03:19 PM IST

మెగాస్టార్ చిరంజీవి దూకుడు మామూలుగా లేదు. నేటి తరం యువ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా జెట్ స్పీడ్ లో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అంతే కాకుండా అదే స్పీడ్లో షూటింగ్ పనులను కూడా పూర్తి చేయడానికి సిద్ధమవుతున్నారు. వీలైనంత వరకు మంచి సందేశం ఇచ్చే కమర్షియల్ సినిమాల తోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఆచార్య సినిమాకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టు 22 నా మెగాస్టార్ చిరంజీవి 66 వసంతంలోకి అడుగుపెట్టబోతున్నాడు.

ఇక ఈసారి పుట్టినరోజు సందర్భంగా వరుసగా సినిమాలు అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. ముందుగా 153కు సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ రావచ్చని టాక్ వస్తోంది. మలయాళం లూసిఫర్ కు రీమేక్ గా రాబోతున్న ఆ సినిమాకు మోహన్ రాజు దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ అనుకుంటున్నట్లు టాక్ అయితే వస్తుంది. మరో రెండు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆచార్య సినిమా స్పెషల్ సాంగ్ తో పాటు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా స్పెషల్ ఎనౌన్స్మెంట్ కూడా రానుందట. మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ చేయాలనుకుంటున్న మెగాస్టార్ ఆ సినిమాపై కూడా ఒక క్లారిటీ ఇవ్వనున్నారు. పుట్టినరోజుకు వారం రోజుల ముందు నుంచే మెగా సినిమాల అప్డేట్స్ సందడి చేయనున్నట్లు సమాచారం.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus