Chiranjeevi: చిరంజీవికి భిన్నంగా అభినందనలు తెలిపిన అభిమాని!

  • January 30, 2024 / 04:57 PM IST

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం పద్మ అవార్డుల ప్రకటన చేసింది. మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ అవార్డు చిరంజీవికి రావడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవికి ఎంతోమంది సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు మరి కొంతమంది సెలబ్రిటీలు స్వయంగా ఇంటికి వెళ్లి చిరంజీవి గారిని కలిసి అభిమానం చాటుకున్నారు. ఇక చాలా మంది సోషల్ మీడియాలో కూడా చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు.

ఇదిలా ఉండగా ఓ అభిమాని వినూత్న రీతిలో మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేశారు. న్యూయార్క్ కి చెందిన ఓ అభిమాని వినూత్నంగా అభినందనలు తెలియజేశాడు. ప్రఖ్యాత న్యూయార్క్ టైం స్క్వేర్ స్ట్రీట్ లో చిరంజీవి ఫోటో ప్రదర్శించాడు. ప్రతిష్టాత్మక సివిలియన్ అవార్డు పద్మవిభూషణ్ అందుకున్న చిరంజీవికి శుభాకాంక్షలు అంటూ ఫోటోలు ప్రదర్శింపచేశారు ప్రస్తుతం ఎందుకు సంబంధించినటువంటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కుందవరపు శ్రీనివాస్ నాయుడు అనే ఎన్నారై ఈ విధంగా అభిమానం చాటుకున్నాడు.

కాగా చిరంజీవి 2006లో పద్మభూషణ్ అవార్డుకి ఎంపిక కాక తాజాగా పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపిక అయ్యారు. ఇలా ఈయనకు ఎంతో గౌరవప్రదమైనటువంటి అవార్డు రావడంతో మెగా అభిమానులు కుటుంబ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికి చిరంజీవి వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల భోళా శంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిరు (Chiranjeevi) త్వరలోనే విశ్వంభర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus