త్రిషకు మెగాస్టార్ చిరంజీవి ఖరీదైన కానుక ఇదే.. ఏం ఇచ్చారంటే?

  • March 11, 2024 / 02:24 PM IST

చిరంజీవి (Megastar Chiranjeevi)  త్రిష  (Trisha) కాంబినేషన్ లో చాలా సంవత్సరాల క్రితం తెరకెక్కిన (Stalin)  స్టాలిన్ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. ఆ సమయంలో చిరంజీవి త్రిష జోడీ బాలేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపించాయి. మురుగదాస్ (A.R. Murugadoss) డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల విషయంలో మరీ సంచలనాలు సృష్టించలేదు. అయితే దాదాపుగా 17 సంవత్సరాల తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండటం గమనార్హం. అయితే త్రిషకు చిరంజీవి ఖరీదైన కానుక ఇవ్వగా త్రిష ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

టెంపరేచర్ ను కంట్రోల్ చేసే స్మార్ట్ మగ్ ను చిరంజీవి త్రిషకు బహుమతిగా ఇచ్చారని తెలుస్తోంది. చిరు సార్.. ధన్యవాదాలు అనే క్యాప్షన్ తో త్రిష ఈ స్మార్ట్ మగ్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం జరిగింది. హీరోయిన్ త్రిష షేర్ చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరోవైపు చిరంజీవి, త్రిష కాంబినేషన్ లో కాంబోలో తెరకెక్కుతున్న విశ్వంభర (Vishwambhara) మూవీ 2025 సంవత్సరం జనవరి నెల 10వ తేదీన రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.

ఎం.ఎం.కీరవాణి (M. M. Keeravani) ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా (Sai Madhav Burra) ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆయన స్థానంలో ఈ సినిమా కోసం ఎవరు పని చేస్తారో చూడాల్సి ఉంది. విశ్వంభర సినిమా 2025 సంవత్సరం బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. విశ్వంభర సినిమాతో చిరంజీవి కలెక్షన్ల విషయంలో సైతం సంచలనాలు సృష్టిస్తారని ఫ్యాన్ఫ్ ఫీలవుతున్నారు.

చిరంజీవి కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుండగా రాబోయే రోజుల్లో మెగాస్టార్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలను సృష్టిస్తారో చూడాల్సి ఉంది. చిరంజీవి తన ఎనర్జీ లెవెల్స్ తో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తున్నారు. త్రిష విశ్వంభరతో తెలుగులో బిజీ అవుతానని భావిస్తున్నారు.

‘గామి’ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు!

స్టార్‌ హీరో అజిత్‌ హెల్త్‌ అప్‌డేట్‌ వచ్చేసింది… ఎలా ఉందంటే?
ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై శరణ్య ప్రదీప్ ఫైర్.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus