Chiranjeevi: అయ్యో.. గాడ్ ఫాదర్ మూవీకి ఇన్ని కష్టాలా?

  • September 21, 2021 / 03:03 PM IST

స్టార్ హీరో చిరంజీవి రాబోయే నాలుగేళ్లలో ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించాలని భావించి ఈ మధ్య కాలంలో రీమేక్ సినిమాలలో ఎక్కువగా నటిస్తున్నారు. మోహన్ రాజా డైరెక్షన్ లో మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ సినిమా రీమేక్ గాడ్ ఫాదర్ పేరుతో తెలుగులో తెరకెక్కుతోంది. ఇప్పటికే మోహన్ రాజా తెలుగు నేటివిటీకి తగిన విధంగా కీలక మార్పులు చేశారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది.

అయితే గాడ్ ఫాదర్ స్క్రిప్ట్ లో చిరంజీవి కొన్ని మార్పులు కోరారని ఆ మార్పులు పూర్తైన తరువాత గాడ్ ఫాదర్ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని సమాచారం. వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాలో కీలక పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా మేకర్స్ నుంచి ఈ వార్తకు సంబంధించి ఎలాంటి ప్రకటన లేదు. గాడ్ ఫాదర్ మూవీపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ప్రస్తుతం చిరంజీవి ఆచార్య బ్యాలెన్స్ షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఏపీలో టికెట్ రేట్లు పెరగకపోవడంతో ఆచార్య రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన రావడం లేదు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఆచార్య మూవీ రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయితే ఆచార్య రిలీజ్ డేట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చిరంజీవి, చరణ్ కాంబినేషన్ లో కొరటాల శివ తెరకెక్కించిన ఆచార్య సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus