బుల్లి తెరపై ‘మెగా’ ఎంట్రీ..

నటుడిగా 150 సినిమాల చరిత్ర. రికార్డులది మరో చరిత్ర. నిర్మాతలకు మనీ మెషిన్.. అభిమానులకి దైవం.. దర్శకులకు ఒక్కసారైనా పనిచేయాలనుకునే స్టార్. ఇవన్నీ కలిపితే వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ‘కత్తి’ రీమేక్ తో రీ ఎంట్రీ ఇవ్వనున్న చిరు దానైకంటే ముందే బుల్లి తెరపై మెగా ఎంట్రీ ఇవ్వనున్నారు.

మా టీవీలో ప్రేక్షకాదరణ పొందిన కార్యక్రమాల్లో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ఒకటి. మూడు సీజన్లుగా ఈ కార్యక్రామానికి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. 4వ సీజన్ కి చిరంజీవి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నట్టు మా టీవీ ప్రకటించింది. గతేడాది వరకు ఈ ఛానెల్ లో నాగార్జున, చిరు, అల్లు అరవింద్ వాటాదారులుగా ఉన్న సంగతి తెలిసిందే. తర్వాత ఈ ఛానెల్ ని స్టార్ గ్రూప్ సొంతం చేసుకుంది. దాంతో తమ ఛానెల్ ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు స్టార్ గ్రూప్ వారు చిరుని ఎంచుకున్నారా అని అనుమానం తలెత్తుతోంది. ఈ మాట ఎలా వున్నా సంక్రాంతికి విడుదల కానున్న చిరు ‘ఖైదీ నెం 150’ సినిమాకి ఈ కార్యక్రమం మంచి ప్రచారాన్ని తీసుకొస్తుందనడం నిర్వివాదాంశం. డిసెంబర్ 12 నుండి ఆ కార్యక్రమం ప్రసారం కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus