Viswambhara: విశ్వంభర సెట్స్ లోకి అడుగుపెట్టిన చిరు!

  • February 2, 2024 / 04:04 PM IST

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక ఇటీవల భోళా శంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన ఈ సినిమా ద్వారా పెద్దగా ప్రేక్షకాదరణ నోచుకోలేకపోయారు. ఇక ఈ సినిమా తర్వాత కొంత విరామం ఇచ్చినటువంటి చిరంజీవి తిరిగి విశ్వంభర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. బింబిసారా డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది తాజాగా ఈ సినిమా షూటింగ్ లొకేషన్లోకి మెగాస్టార్ చిరంజీవి అడుగు పెట్టారని తెలుస్తుంది.

ఇదే విషయాన్ని మేకర్స్ తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేశారు. అదేవిధంగా ఈ సినిమా విడుదల తేదీని కూడా అనౌన్స్ చేశారు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా టైటిల్ ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఇలా టైటిల్ ప్రకటించిన అనంతరం ఈ సినిమా తిరిగి వచ్చే సంక్రాంతికి రాబోతుందని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. సంక్రాంతికి విడుదల అవుతుందని తెలియజేశారు కానీ ఎప్పుడు విడుదలవుతుంది అనే విషయం గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు కానీ తాజాగా ఈ సినిమా విడుదల తేదీ గురించి మేకర్స్ అధికారికంగా తెలియజేశారు.

విశ్వంభర (Viswambhara) సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 10వ తేదీ విడుదల కాబోతుందని మేకర్స్ తెలియజేశారు. ఇక ఈ సినిమా యువి క్రియేషన్ బ్యానర్స్ పై తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక నేడు షూటింగ్ లొకేషన్లోకి అడుగు పెట్టినటువంటి చిరంజీవి వరుస షెడ్యూల్ చిత్రీకరణలో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus