మెగా ఫ్యాన్స్ కు మరో సర్ప్రైజ్…!

  • March 30, 2020 / 07:34 PM IST

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో తన 152 వ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రాంచరణ్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఫాస్ట్ గా ఫినిష్ చేసి ఆగష్టులో విడుదల చెయ్యాలని భావించారు. కానీ కరోనా వల్ల షూటింగ్ పోస్ట్ పోన్ అవ్వడంతో అది వర్కౌట్ అయ్యేలా లేదు.

ఇక ఉగాదికి ఫస్ట్ లుక్ ఇస్తారని కూడా వార్తలు వచ్చాయి. కానీ.. అదే రోజున ‘ఆర్.ఆర్.ఆర్’ నుండీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల కావడంతో .. అందరి అటెన్షన్ దాని పైనే ఉంటుందని భావించి డ్రాప్ అయినట్టు తెలుస్తుంది. ఇక మెగాస్టార్ కూడా అదే రోజున ట్విట్టర్ ఎంట్రీ ఇవ్వడం కూడా జరిగింది. మరి ‘ఆచార్య’ ఫస్ట్ లుక్ ఎప్పుడు విడుదల చేస్తారు అనే దాని పై కూడా చర్చ మొదలైంది.

అందుతున్న సమాచారం ప్రకారం శ్రీరామనవమి కానుకగా ఏప్రిల్ 2న విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఆ ఫస్ట్ లుక్ తో మెగాస్టార్ ఫ్యాన్స్ ను ఏ రేంజ్ లో ఖుషీ చేస్తారో చూడాలి. ఇక ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన కాజల్ హీరోయిన్ గా నటించబోతుంది. ఇక మణిశర్మ సంగీతం అందిస్తుండడం విశేషం.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus