పూజలు చేస్తున్న మెగాఫ్యామిలీ!!!

టాలీవుడ్ టాప్ హీరోగా ఒక వెలుగు వెలిగి, అటుపై రాజకీయ అరంగేట్రం చేసి, అక్కడ పెద్దగా కలసిరాక మళ్లీ ఇండస్ట్రీనే నమ్ముకున్న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు మరో మూడు రోజుల్లో రానుండడంతో అభిమానులు అందరూ ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే అదే క్రమంలో మెగా ఫ్యామిలీ సైతం ఫుల్ బిజీగా దేవాలయాలను కవర్ చేసుకుంటూ పోతున్నారు. అదే క్రమంలో అందరూ అన్ని గుళ్లకి వెళ్లని పరిస్థితుల్లో ఒక్కొక్కరూ ఒక్కో గుడిని ఓవర్ చేస్తున్నారు….ఇంతకీ ఎవరెవరు ఏ గుడిలో పూజలు చేయిస్తున్నారో తెలుసా….ముందుగా…

హైదరాబాద్ లోని స్కందగిరి ఆలయంలో మెగా బ్రదర్ నాగబాబు ప్రత్యేక పూజలు చేస్తే.. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబంతో కలిసి శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లి సూర్య దేవాలయాన్ని సందర్శించి.. అక్కడ ప్రత్యేక రుద్రాభిషేకం చేశారు. ఇక సుప్రీమ్ హీరో సాయిధరం తేజ్ తన సినిమా ప్రమోషన్ ను సైతం పక్కన పెట్టి మరీ… అంతర్వేది వెళ్లి మరీ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అదే క్రమంలో మెగా పవర్ స్టార్ సతీమణి, మెగాస్టార్ కోడలు ఉపాసన ఏకంగా మంత్రాలయం వెళ్లి పూజలు చేస్తోంది. అంతా బాగానే ఉంది కదా…..సడన్ గా మెగా ఫ్యామిలీ అంతా ఇలా డివోషనల్ టర్న్ ఎందుకు ఇచ్చుకున్నారో అని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బహుశా సొంత బ్యానర్ లో సినిమా చేస్తున్నారు కదా….హిట్ అయ్యి కాసుల వర్షం కురవాలి అని ఏమో…

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus