Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి మూవీ ఓవర్సీస్ రైట్స్ ఎంతో తెలుసా?

  • January 28, 2024 / 06:27 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి ఒక ప్రాజెక్ట్ పూర్తైన వెంటనే మరో సినిమాలో నటిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మెగాస్టార్ చిరంజీవి మూవీ ఓవర్సీస్ రైట్స్ ఏకంగా 18 కోట్ల రూపాయలు అని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. చిరంజీవి విశ్వంభర ఓవర్సీస్ రైట్స్ అంత పలికాయని తెలిసి నెటిజన్లు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.

విశ్వంభర మూవీ రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి1 నుంచి మొదలుకానుండగా ఈ సినిమా కోసం స్పెషల్ సెట్స్ వేస్తున్నారని సమాచారం అందుతోంది. విశ్వంభర మూవీ ఏకంగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఆ బడ్జెట్ కు అనుగుణంగా ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. షూటింగ్ మొదలుకాకుండానే ఈ రేంజ్ లో బిజినెస్ జరుగుతుండటం ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.

త్వరలో విశ్వంభర మూవీలో నటించే నటీనటుల వివరాలతో పాటు ఇతర కీలక నటుల వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించిన యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ఈ సినిమాను నిర్మిస్తుండటం ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. విశ్వంభర సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుండగా ఈ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

చిరంజీవి ఈ సినిమాకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారని సమాచారం అందుతోంది. తాజాగా చిరంజీవికి పద్మ విభూషణ్ రావడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేవు. ఈ ఏడాది చిరంజీవి నటించిన సినిమాలేవీ రిలీజ్ కావడం లేదని తెలుస్తోంది. విశ్వంభర సినిమాలో (Vishwambhara) విజువల్ ఎఫెక్స్ట్ కు పెద్దపీట వేస్తున్నారని ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus