నిరాశ లో మెగా ఫ్యాన్స్…. కారణం!

టాలీవుడ్ ను ఏలుతున్న హీరోలు…పాపం బుల్లి తెరపై తమ విశ్వరూపం చూపించే క్రమంలో చతికిల పడుతున్నారు అని కొన్ని షోస్ చూస్తే అర్ధం అవుతుంది…ఉదాహరణకి…మీలో ఎవరు కోటీశ్వరుడు తీసుకోండి….వెండి తెర మెగాస్టార్ గా కొలుచుకునే చిరు సైతం ఆ కార్యక్రమాన్ని రక్తి కట్టించలేక ఎన్నో ఆపసోపాలు పడ్డాడు అని ఒప్పుకోక తప్పని విషయం…అయితే అదే క్రమంలో ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న ‘బిగ్ బాస్’ సైతం ఉంది…అయితే…ఈ రెండింటికి కాస్త తేడా ఉంది…మెగాస్టార్ కన్నా…ఎన్టీఆర్ చేస్తున్న షో కాస్తో కూస్తో మెప్పిస్తుంది అని వార్తలు వస్తున్నాయి….దానికి గల కారణాలు చాలానే ఉన్నాయి అవేమిటి అంటే…. ‘బిగ్ బాస్’ షోకి సంబంధించి ఎన్టీఆర్ తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఎనర్జీతో వాక్చాతుర్యంతో  సందర్భోచిత హాస్యంతో ఈషోను రక్తి కట్టిస్తున్నాడు, అంతేకాకుండా….జూనియర్ కు ఉన్న జ్ఞాపకశక్తి ‘బిగ్ బాస్’ షోకు వరంగా మారింది అని న్యూస్ వినిపిస్తుంది.

‘బిగ్ బాస్’కు సంబంధించిన స్క్రిప్టును చక్కగా గుర్తుపెట్టుకోవడమే కాకుండా సందర్భోచితంగా అప్పటికప్పుడు మాటలు మారుస్తూ స్పాంటేనియస్‌ గా వినోదాన్ని పంచే విషయంలో జూనియర్ ప్రదర్శిస్తున్న సమయస్పూర్తి సైతం ఈ షో కి ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు….ఇక ఇవన్నీ కోటీశ్వరుడు షో విషయంలో చిరంజీవి ప్రదర్శించలేక పోవడం, టాలీవుడ్ లో సెన్సేషనల్ స్టార్ గా ఎదిగిన చిరు…బుల్లి తెరపై డీలా పడటంతో…చిరంజీవి అభిమానులకు బయటకు చెప్పుకోలేని అవమానంగా ఫీలవుతూ ఉన్నారు అని తెలుస్తుంది…. వాస్తవానికి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోలాగే ‘బిగ్ బాస్’ షో కూడ అందర్నీ మెప్పించలేకపోయినా బుల్లితెర పై చిరంజీవికి రాని ఇమేజ్ జూనియర్ కు రావడం మెగా అభిమానులకు అసహనాన్ని కలిగిస్తోంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..మొత్తంగా చూసుకుంటే…ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కి ఫిదా అయిన ప్రేక్షకులు…పాపం చిరు పర్ఫార్మెన్స్ కి మాత్రం సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు అని ఒప్పుకోక తప్పదు….


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus