జైనుల మంత్రాన్ని మ్యూట్ చేసిన ‘ఈ మాయ పేరేమిటో’ చిత్ర బృందం

ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ “ఈ మాయ పేరేమిటో” సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు. రాము కొప్పుల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నిన్న విడుదలై మంచి స్పందన అందుకుంది. అన్ని వర్గాల నుంచి అభినందనలు వస్తుండడంతో ఆనందంలో ఉన్న చిత్ర బృందాన్ని కొన్ని విమర్శలు ఇబ్బంది పెట్టాయి. ఈ చిత్రంలోని ఓ పాటలో జైన మతస్థులు ఆరాధించే మంత్రాన్ని కించపర్చేలా చేశారని ఆరోపిస్తూ పలువురు జైనులు ఆందోళనకు దిగారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల చిత్ర ప్రదర్శనలను అడ్డుకున్నారు. జైనుల ఆందోళనకు చిత్ర బృందం వెంటనే స్పందించింది.

తమ చిత్రంలోని పాటలో పొందుపర్చిన జైన మంత్రాన్ని వెంటనే మ్యూట్ చేశారు. ఈ రోజు నుంచి ప్రదర్శితమయ్యే అనేక థియేటర్లలో ఆ మంత్రం వినిపించకుండా చేశామన్నారు. మిగిలిన ప్రాంతాల్లో ఈ సమస్యను సాయంత్రంలోపున పరిష్కరిస్తామని చెప్పారు. తమ పొరపాటు వల్ల జైనుల మనోభావాలు దెబ్బతిన్నందుకు క్షమాపణలు చెబుతున్నట్లు ప్రెస్ నోట్ ని విడుదల చేశారు. దీంతో జైన మత పెద్దలు శాంతించారు. సినిమా ప్రదర్శనకు ఆటకం కలిగించవద్దని తమ సామజిక వర్గ ప్రజలకు వెల్లడించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus