Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Advertisement

ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ సినిమాల లైనప్‌ గురించి గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఫలానా దర్శకుడు కథ చెప్పారని, ఫలానా దర్శకుడు లైన్‌ ఓకే చేసుకున్నారని, ఫలానా దర్శకుడి సినిమా ఆగిపోయిందని ఏవేవో వార్తలు బయటకు వస్తున్నాయి. ఏ విషయంలోనూ క్లారిటీ రావడం లేదు. అయితే ఆయన పుట్టిన రోజు సందర్భంగా విషెస్‌ పోస్టర్లు వస్తాయి, క్లారిటీ వస్తుంది అనుకున్నారు. అనుకున్న రోజు వచ్చింది.. పోస్టర్లు అయితే రాలేదు. కానీ సాయంత్రానికి ఫొటోలతో క్లారిటీ వచ్చింది.

Balakrishna

బుధవారం నాడు బాలకృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షల వెల్లువ కురిసింది. ఆయన్ని కలిసి విష్‌ చేసినవారిలో దర్శకులు వివేక్‌ ఆత్రేయ, విజయ్‌ కనకమేడల ఉన్నారు. వారిద్దరూ బాలయ్య కోసం కథలు సిద్ధం చేస్తున్నారని, త్వరలోనే ఆ ప్రాజెక్టులు పట్టాలెక్కే అవకాశాలున్నాయని ఇప్పటికే టాక్‌ వచ్చింది. దీంతో వీరి ప్రాజెక్ట్‌లు ఫిక్స్‌ అని చెప్పొచ్చు. అలాగే ఇటీవల అనౌన్స్‌ అయిన కొరటాల శివ ప్రాజెక్ట్‌ విషయంలోనూ క్లారిటీ వచ్చింది. కొరటాల శివ కలవకపోయినా ఆ సినిమా నిర్మాత సుధాకర్‌ చెరుకూరి అయితే బాలయ్యను కలిశారు.

ఇంకా ప్రస్తుతం బాలకృష్ణతో సినిమా చేస్తున్న దర్శకుడు గోపీచంద్‌ మలినేని, నిర్మాత సతీశ్‌ కిలారు కూడా కలిశారు. మరో నిర్మాత రవిశంకర్‌ యలమంచిలి కూడా బాలయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. వివేక్‌ ఆత్రేయ సినిమా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ మీదే తెరకెక్కనుందని సమాచారం. ‘బ్రోచేవారెవరురా’, ‘సరిపోదా శనివారం’ సినిమాలతో వివేక్‌ ఆత్రేయ మెప్పించగా.. ‘నాంది’, ‘భైరవం’ సినిమాలతో విజయ్‌ కనకమేడల అదరగొట్టారు.

ఇక కొరటాల శివ ‘దేవర 2’ సినిమా ఆలోచనను పక్కన పెట్టేసి బాలయ్య కోసం కథ సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాకు 112 సీరియల్‌ నెంబర్‌ కూడా ఇచ్చారు. మరి బాలయ్యతో పొలిటికల్‌ + సోషల్‌ + కమర్షియల్‌ + ఎమోషనల్‌ టచ్‌ ఉన్న సినిమా చేస్తారని టాక్‌. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందట.

మీరే నా సర్వస్వం.. ఎలా తట్టుకోవాలి: రాధిక ఎమోషనల్‌ పోస్ట్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus