‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నప్పుడు వెనుక ఉన్న కథానాయిక శ్రీలీల, నటుడు మహేష్ ఆచంట మధ్య ఏదో జరిగింది.. అందుకే శ్రీలీల సీరియస్‌గా చూసింది అంటూ నిన్నంతా పెద్ద రచ్చ సాగింది. ఏదో జరిగిపోయినట్లు మాట్లాడుకున్నారు నెటిజన్లు. అయితే అప్పుడేం జరిగింది అనే విషయాన్ని నటుడు మహేష్ తన సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చాడు. ఏదేదో అనుకోవద్దు అని చెప్పుకొచ్చాడు.
తన ఫోన్ పట్టుకోమని శ్రీలీల అంతకుముందే నాకు ఇచ్చారు. అక్కడికి కాసేపటికి ఆమె వెనక్కి తిరిగి చూశారు. నా వైపు చూస్తే ఫోన్ కోసమే చూస్తున్నారు అనుకున్నా. ఆవిడేమ పైకి స్క్రీన్ వైపు చూశారు. ఆ వెంటనే ముందుకు తిరిగిపోయారు. అక్కడ జరిగింది ఇదే. ఇక్కడ ఎవరినీ అగౌరవ పరచవద్దు అంటూ మహేష్ తన సోషల్ మీడియా పోస్టులో రాసుకొచ్చారు. దీంతో ఇప్పటికైనా ఈ విషయాన్ని వదిలేయాలి అని నెటిజన్లు కోరుతున్నారు.
ఇదిలా ఉండగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు హరీష్ శంకర్‌కు కృతజ్ఞతలు తెలిపాడు మహేష్. చిరంజీవితో ‘ఖైదీ నెంబర్ 150’, రామ్ చరణ్‌తో ‘రంగస్థలం’ సినిమాల్లో తాను నటించానని, ఆ రెండూ బ్లాక్ బస్టర్ అయ్యాయని మహేష్ గుర్తు చేశాడు. ఇప్పుడు పవన్ కల్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో నటించడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఆకాంక్షించారు. ఈ నెల 19న అందరూ సినిమా చూడాలని కోరారు.
ఆయన పోస్టు కింద అభిమానులు రియాక్ట్ అవుతూ ‘ఏదో జరిగిందంటూ కొందరు అనవసరంగా సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ చేసి, కామెంట్స్ చేస్తుంటారని.. వాటిని పట్టించుకోవద్దని రాసుకొస్తున్నారు. మహేష్ చెప్పినట్లుగానే ఆ వీడియోలో శ్రీలీల వెనుక స్క్రీనే చేశారు. అయితే ముందుకు తిరిగి సీరియస్ లుక్ ఇచ్చారు. ఎందుకు అనేది ఇప్పుడు ఈయన చెప్పారు.