స్టార్ హీరోయిన్ స్థాయిలో సమంత వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి సినిమా ప్రియులందరికి తెలిసిందే. ప్రస్తుతం సమంత శాకుంతలం, యశోద, ఖుషి సినిమాలతో సమంత తన రేంజ్ మారిపోతుందని భావిస్తున్నారు.ఇదిలావుండగా సమంత నాగచైతన్య చాలా సంవత్సరాల పాటు ప్రేమించుకుని పెళ్లైన నాలుగేళ్ల తర్వాత విడిపోయిన సంగతి తెలిసిందే.అయితే సమంత చైతన్య ఎందుకు విడిపోయారనే ప్రశ్నకు జవాబు తెలియక అక్కినేని ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇకపోతే ఎంతో అన్యోన్యంగా ఉన్న చైతన్య సమంతల మధ్య కొన్ని నెలల్లోనే ఏం జరిగిందో ఫ్యాన్స్ కు అస్సలు అర్థం కావడం లేదు.
నాగచైతన్యకు ముందు సమంత సిద్ధార్థ్ ను ప్రేమించిన సంగతి తెలిసిందే. అయితే జబర్దస్త్ అనే సినిమాలో సిద్దార్థ్, సమంత కలిసి నటించారు.కాగా శ్రీకాళహస్తిలో సిద్దార్థ్, సమంత కలిసి పూజలు చేశారని అప్పట్లో వార్తలు తెగ వైరల్ అయ్యాయి.సిద్దార్థ్ సమంత విడిపోవడానికి చాలామందికి కారణం తెలియదు.కాగా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడం వల్లే సమంత సిద్ధార్థ్ విడిపోయారని సమాచారం. అయితే నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకున్న తర్వాత సమంతను టార్గెట్ చేస్తూ సిద్దార్థ్ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే.
ఇకపోతే (Samantha) సమంతనే తనను మోసం చేసిందని అప్పట్లో సిద్ధార్థ్ పరోక్షంగా చెప్పుకొచ్చారు. ఇదిలావుండగా మరోవైపు సమంత ప్రస్తుతం మీడియాకు దూరంగా ఉంటున్నారు.అయితే విడాకులకు సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతూ ఉండటంతో సమంత మీడియాకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.ఇక ప్రస్తుతం సమంత వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా మారుతోంది. ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి అని సినిమాలో నటిస్తోంది. ఇక సోషల్ మీడియాలో మాత్రం సమంత యాక్టివ్ గా ఉంటున్నారు.
సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!