Vijay Devarakonda, Vishwak Sen: సోషల్ మీడియాలో విశ్వక్ సేన్, విజయ్ దేవరకొండ అభిమానుల మధ్య హాట్ హాట్ డిస్కషన్స్

టాలీవుడ్లో స్టార్ హీరోలు అంటే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , మహేష్ బాబు(Mahesh Babu), రాంచరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (Jr NTR) , అల్లు అర్జున్ (Allu Arjun). వీళ్ళ తర్వాత స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న హీరో ఎవరైనా ఉన్నారా? అంటే అది డౌట్ లేకుండా విజయ్ దేవరకొండ అనే చెప్పాలి. ‘పెళ్ళిచూపులు’ (Pelli Choopulu) ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) ‘గీత గోవిందం’ (Geetha Govindam) ‘టాక్సీ వాలా’ (Taxiwaala) సినిమాలతో స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) . అయితే ఆ తర్వాత ఇతను చేసిన ‘డియర్ కామ్రేడ్’ (Dear Comrade) ‘వరల్డ్ ఫేమస్ లవర్’ (World Famous Lover) ‘లైగర్’  (Liger) వంటి సినిమాలు ప్లాప్ అయ్యాయి.

‘ఖుషి’ (Kushi) కొంతలో కొంత పర్వాలేదు అనిపించినా బాక్సాఫీస్ వద్ద అనుకున్న ఫలితాన్ని అయితే అందుకోలేదు. ఇక తాజాగా రిలీజ్ అయిన ‘ది ఫ్యామిలీ స్టార్’ (The Family Star) పై రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో యాంటీ ఫ్యాన్స్ విజయ్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. విజయ్.. నానికి (Nani) కాంపిటీషన్. అందువల్ల విజయ్ పై నాని అభిమానులు నెగిటివ్ కామెంట్స్ చేయడం సాధారణమైన విషయమే అనుకోవాలి.

కానీ విజయ్ దేవరకొండని ఎక్కువగా విమర్శిస్తున్న వారిలో విశ్వక్ సేన్ (Vishwak Sen) ఫ్యాన్స్ ఉన్నారు అనేది కొందరి వాదన. ‘ఫ్యామిలీ స్టార్’ కి మిక్స్డ్ టాక్ మొదలవ్వగానే వారు యాక్టివ్ అయిపోయి.. విజయ్ ని, ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాని ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్నట్టు స్పష్టమవుతుంది. ఈ క్రమంలో కొంతమంది కామన్ ఆడియన్స్ ‘విజయ్ ఇంకో పది ప్లాపులు ఇచ్చినా అతని స్టార్ డం చెక్కుచెదరదు..

విశ్వక్ సేన్ ఇంకో 10 బ్లాక్ బస్టర్స్ కొట్టినా స్టార్ అవ్వలేడు’ అంటూ చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. మరోపక్క వీకెండ్ తో పాటు ఉగాది, రంజాన్.. హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ‘ఫ్యామిలీ స్టార్’ బాక్సాఫీస్ వద్ద క్యాష్ చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ కొంతమంది ఈ సినిమాకి పాజిటివ్ రిపోర్ట్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. అందుకే టీం కూడా థియేటర్ విజిట్స్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus