K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

టాలీవుడ్‌లోనే కాదు.. మొత్తం ఇండియన్‌ సినిమాలోనే ఆయన లాంటి దర్శకుడు మరొకరు లేరు. ఈ మాట అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన తీసిన సినిమాలు, టచ్‌ చేసిన జోనర్లు, తెరకెక్కించిన కథలు అలాంటివి మరి. ఇప్పుడంటే ఆయన రెస్ట్‌ మోడ్‌లో ఉన్నారు కానీ.. ఆయన ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నప్పుడు చేసిన సినిమాల రికార్డులు, అందుకున్న వసూళ్ల గురించి నెలల తరబడి మాట్లాడుకునేవారు. కానీ గత కొన్ని రోజులుగా ముఖ్యంగా వెంకటేశ్‌ – కల్యాణ్‌ రామ్‌ సినిమా స్టార్ట్‌ అయిన రోజు నుండి అవసరం లేని పాయింట్‌ పట్టుకుని నానా రచ్చ చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు.

K Raghavendra Rao

వెంకటేశ్‌ – కల్యాణ్‌ రామ్‌ హీరోలుగా.. కీర్తి సురేశ్‌ – కృతి శెట్టి హీరోయిన్లుగా అనిల్‌ రావిపూడి ఓ సినిమాను ఇటీవల స్టార్ట్‌ చేశారు. ఆ సినిమా ముహూర్తం ఇటీవల జరిగింది. దానికి ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో కృతి శెట్టి రెండు భుజాల మీద చేతులు వేసి పట్టుకున్నారు. ఈ సన్నివేశాన్ని ఎవరో వెనుక నుండి ఫొటో తీశారు. ఆ ఫొటోను షేర్‌ చేస్తూ ‘ఈయనేంటి ఇలా చేస్తున్నారు’ అంటూ ఏవేవో ఉద్దేశాలు ఆపాదించి రాసేస్తున్నారు.

అతేకాదు ఆ మధ్య మరో సినిమా ఈవెంట్‌కి వెళ్లినప్పుడు మెగా డాటర్‌ నిహారిక నడుము మీద చేయి వేసి పట్టుకున్న ఫొటోను, అంతకుముందు ఇతర హీరోయిన్లతో ఇలాగే చేసిన ఫొటోలను షేర్‌ చేస్తూ ఎప్పటి నుండో ఈయన ఇంతే అని రాసుకొస్తున్నారు. అసలు ఆయన అలా ఎందుకు చేశారు, సందర్భం ఏంటి అనేది పట్టించుకోకుండా ఏదేదో రాసేస్తున్నారు. దీంతో ఆయన అభిమానులు ఇబ్బందిపడుతున్నారు. నిజానికి ఆయన మీద ఇలాంటి ఆరోపణ రావడం ఇదేం తొలిసారి కాదు.

ప్రముఖ కథానాయిక తాప్సి ఇక్కడ పేరు తెచ్చుని బాలీవుడ్‌ వెళ్లిపోయిన తర్వాత తన తొలి సినిమాకు పడ్డ ఇబ్బందులు అంటూ ఇప్పటికీ కథలు కథలుగా చెబుతూ వస్తోంది. ఆ సినిమానే ‘ఝుమ్మంది నాదం’. ఆ సినిమాకు దర్శకుడు రాఘవేంద్రరావునే. ఆ లెక్కన తాప్సి చెప్పింది ఆయన గురించే అంటూ కొన్ని అపవాదులు వేసేశారు. ఇప్పుడు మళ్లీ కృతి ఫొటో పట్టుకుని ట్రోల్‌ చేస్తున్నారు.

2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus