ఫన్ అండ్ ఎమోషన్స్ తో కూడిన ‘కమిట్ మెంటల్’ ట్రైలర్!

బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి భూపాళం, ఉద్భవ్ రఘునందన్ ప్రధాన పాత్రలో ‘కమిట్ మెంటల్’ అనే వెబ్ సిరీస్ రూపొందిన సంగతి తెలిసిందే. తెలుగు ఓటీటీ ‘ఆహా’ కోసం రూపొందించిన ఈ వెబ్ సిరీస్ ని పవన్ సాదినేని డైరెక్ట్ చేశారు. నవంబర్ 13 నుంచి ‘ఆహా’ లో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే టీజర్ ని విడుదల చేశారు. దీనికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ట్రైలర్ ని విడుదల చేశారు వెబ్ సిరీస్ నిర్వాహకులు.

టీజర్ ని ఫన్ గా చూపిస్తే.. ట్రైలర్ లో ఎమోషన్స్ ని కూడా చూపించారు. మూడేళ్లు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్న అమ్మాయి, అబ్బాయి.. కలిసి ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారనే కాన్సెప్ట్ తో ఈ సిరీస్ ని రూపొందించారు. ట్రైలర్ చివర్లో పునర్నవి చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది.

”నైట్ టైమ్ లైట్‌ వేసుకుని పడుకుంటానా..? లేకుండా పడుకుంటానా..? Do I Like Hollywood, Tollywood or Bollywood? నాకు కుక్క అంటే భయమా, పిల్లి అంటే భయమా..? నాకు బంగ్లాలో ఉండడం ఇష్టమా..? అపార్ట్మెంట్స్ లో ఉండడం ఇష్టమా..? నాకు ఏ ఫుడ్‌ అంటే ఎలర్జీ ఉంది..? ఏ ఫుడ్ అంటే లేదు..? చెప్పూ..” అంటూ తన బాయ్ ఫ్రెండ్ ని ప్రశ్నించే ఫ్రస్ట్రేటెడ్ గర్ల్ ఫ్రెండ్ గా బాగా నటించింది. ఈ సిరీస్ బాలీవుడ్ ‘పర్మినెంట్ రూమ్ మేట్స్’ వెబ్ సిరీస్ కి తెలుగు రీమేక్ గా రానుంది. ప్రముఖ మీడియా ప్రొడక్షన్ హౌస్ తమడా నిర్మాణ భాగస్వామ్యంలో టీవీఎఫ్ ప్రొడక్షన్స్ ఈ వెబ్ సిరీస్ ని నిర్మించింది.


‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus