Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

72వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్ళు'(Committee Kurrollu) సినిమా సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఉత్తమ జాతీయ తెలుగు చిత్రం, బెస్ట్ మేకప్ కేటగిరీల్లో 2 జాతీయ పురస్కారాలను సొంతం చేసుకుంది ఈ చిత్రం. దీంతో చిత్రబృందం తమ ఆనందాన్ని పంచుకునేందుకు నిన్న ఓ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో.. దర్శకుడు యదు వంశీ కొన్ని ఆసక్తికర నిజాలు బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. ఆల్మోస్ట్ ఇవి ప్రతి సినిమా యూనిట్ ఫేస్ చేసేవే అయినప్పటికీ.. ప్రమోషన్స్ లో ఇలాంటివి ఎక్కడా కూడా బయటపెట్టరు.

Committee Kurrollu

ఇంతకీ యదు వంశీ ఏమన్నాడంటే.. ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకి దాదాపు రూ.9 కోట్లు బడ్జెట్ పెట్టిందట నిర్మాత నిహారిక కొణిదెల. అయితే రిలీజ్ కి ముందు వరకు ఈ సినిమాకి బిజినెస్ జరగలేదట. ఓటీటీ ఎవ్వరూ కొనుక్కోలేదట. థియేట్రికల్ సంగతి ఇక చెప్పనవసరం లేదు. పైగా రిలీజ్ కి ముందు ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకి నెగిటివ్ టాక్ ఉందని కూడా యదు వంశీ ఒప్పుకున్నాడు. సినిమాలో చాలా పోర్షన్ ట్రిమ్ చేయాలని.. డిస్ట్రిబ్యూటర్లు చెప్పారట.

కానీ నిహారిక మాత్రం.. ‘ఎటువంటి ట్రిమ్మింగ్ చేసేది లేదు’ అని తెగేసి చెప్పేసిందట. సొంతంగా రిలీజ్ చేసుకుందట. కానీ రిలీజ్ కి ముందు రోజు వరకు ‘సినిమా అటు ఇటు అయితే నాది 2 ఏళ్ళే పోయేది.. కానీ అక్కడ రూ.9 కోట్లు రిస్క్ లో ఉంది కదా అని భయమేసింది’ అంటూ రిలీజ్ టైంలో పడిన టెన్షన్ ను బయటపెట్టాడు వంశీ. అది మేటర్..!

వరుణ్‌తేజ్‌కి ఏమైందో తెలుసుగా.. చేతికి కర్ర ఎందుకో తెలుసుగా?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus