రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

బాలీవుడ్ స్టార్ కపుల్స్ లో .. మోస్ట్ లవబుల్ కపుల్ అంటే దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ దంపతులు అనే చెప్పాలి. తాజాగా ఈ కపిల్ తమ అభిమానులతో ఓ తీపికబురు పంచుకున్నారు. విషయం ఏంటంటే.. ఈ జంట తమ రెండవ బిడ్డకు జన్మనిచ్చారట. తమ కుటుంబంలోకి పండంటి ఆడపిల్ల అడుగుపెట్టిందని రివీల్ చేశారు. ఈ సంతోషకరమైన వార్తను దీపికా పదుకొణె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్లో షేర్ చేయడం జరిగింది. తెరపై తమ అద్భుతమైన నటనతో కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టిన ఈ దంపతులు, నిజ జీవితంలోనూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆల్రెడీ ఈ జంటకు దువా అనే పాప ఉంది.

Deepika Padukone, Ranveer Singh

2024 సెప్టెంబర్ నెలలో దీపికా-రణ్‌వీర్ దువాకి జన్మనివ్వడం జరిగింది.ఇప్పుడు మరోసారి ఆడపిల్ల రూపంలో వీరి ఇంటికి మహాలక్ష్మి వచ్చింది. ఇప్పుడు వీరి కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి అనే చెప్పాలి. దువాకి తోడుగా ఇప్పుడు మరో పాప రావడంతో దీపికా, రణ్‌వీర్‌ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీపికా పదుకొణె ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ న్యూస్ షేర్ చేసిన వెంటనే.. బాలీవుడ్ సినీ ప్రముఖులు, ఫాలోవర్స్ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతో ఈ పోస్ట్ ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతోంది.

ఇక ఈ దంపతుల సినిమాల విషయానికి వస్తే.. చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు.రణ్వీర్ దూరంధర్ , దురంధర్ 2 సినిమాలతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అందుకుని మంచి ఊపు మీద ఉన్నాడు. ఇక దీపికా పదుకొనే.. రాకా వంటి పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ యమ బిజీగా గడుపుతోంది.

రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus