Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

 

టీజర్‌ వచ్చేంతవరకు ఒక లెక్క.. టీజర్‌ వచ్చాక మరో లెక్క.. ఇలాంటి ఎగ్జాంపుల్స్‌ టాలీవుడ్‌లో చాలానే చూశాం. ఇటీవల కాలంలో అయితే ఇంకాస్త ఎక్కువగా చూస్తున్నాం. అలా టీజర్‌ దెబ్బ కొట్టిన సినిమాలకు ఒక్కసారి మొరాల్ దెబ్బ తింటోంది. అందుకే ఆ సినిమాను తెరపైకి తీసుకొచ్చినప్పుడు ఎలాంటి నమ్మకం లేకుండా వచ్చిన సినిమాలు ప్రేక్షకుల మన్ననలు పొందడానికి ఇబ్బందిపడుతున్నాయి. ఇప్పుడు ఇంచుమించు ఇలాంటి పరిస్థితుల్లో రిలీజ్‌ అవుతున్న సినిమా ‘ది ప్యారడైజ్‌’.

Nani

లుక్‌, పోస్టర్‌లతో అంచనాలను పెంచుకున్న ‘ది ప్యారడైజ్‌’ సినిమా.. ‘ఆయా షేర్‌..’ పాటతో వాటిని డబుల్‌ చేసింది. ఆ తర్వాత టీజర్‌ వచ్చాక ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ అమాంతం పడిపోయాయి. ఇదేంటి ఇలా అయిపోయింది అనుకుంటుండగా.. ‘యేష నాగుల..’ పాటతో మరోసారి హైప్‌ను పెంచేసుకుంది సినిమా. ట్రైలర్‌ వచ్చాక సినిమాకు ఎలాంటి అంచనాలు పెరుగుతాయో అని అందరూ అనుకుంటూ ఉండగా.. ట్రైలర్‌ తీసుకురావడం లేదు అని చెప్పి షాకిచ్చింది సినిమా టీమ్‌.

సినిమా మీద నమ్మకం ఉండో, నమ్మకం లేకో తెలియదు కానీ.. టైమ్‌ లేదు అనే కారణం చెబుతూ ట్రైలర్‌ను రిలీజ్‌ చేయడం లేదు. ఈ మాటలు ఇలా సాగుతుండగా.. సక్సెస్‌, పేరు, డబ్బుల గురించి తాను ఈ సినిమా చేయడం లేదని, ఈ సినిమా థియేటర్‌లో ప్రేక్షకుడు చూసి ఆస్వాదించాలి అనే చేశాము అని చెప్పాడు నాని. సినిమా వాళ్లకు నచ్చిందా? లేదా? అన్న దాని కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నా అని చెప్పుకొచ్చాడు.

ఈ మాటలు వింటుంటే చాలా పవర్‌ఫుల్‌గా, ప్రేక్షకుల మీద నమ్మకం చూపించినట్లుగా ఉన్నాయి కానీ.. ఇంత పెద్ద సినిమా చేశాక ఇలాంటి మాటలు ఆడటం సరికాదు. కొంతమంది నిర్మాతలు ఈ మాట ముందు అనేసి.. ఆ తర్వాత సినిమా వచ్చి ఇబ్బందికర ఫలితం ఎదురైనప్పుడు ‘మేం ముందే చెప్పాం కదా..’ అనేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాని కామెంట్స్‌ సినిమా వైబ్‌కి, హైప్‌కి అంత మంచిది కాదు.

ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus