శ్రీవిష్ణు నుండీ ఒక సినిమా వస్తుంది అంటే సహజంగానే అంచనాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్..లో శ్రీవిష్ణుకి మంచి క్రేజ్ ఉంది. ఇదిలా ఉండగా.. శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘కామ్రేడ్ కళ్యాణ్'(Comrade Kalyan). జానకీరామ్ మారెళ్ల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. కోన వెంకట్ ఈ చిత్రానికి ప్రెజెంటర్ గా వ్యవహరించారు. విజయ్ బుల్గేనిన్ సంగీత దర్శకుడు. ‘ఒరియా పిల్లా’ పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్, ట్రైలర్ వంటివి కూడా పర్వాలేదు అనిపించాయి.
ఇక రిలీజ్ రోజున సినిమాకి పర్వాలేదు అనిపించే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈవినింగ్ షోల నుండీ ఈ సినిమా కలెక్షన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. తొలిరోజు ఈ సినిమాకి డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే
| నైజాం | 0.55 cr |
| సీడెడ్ | 0.22 cr |
| ఆంధ్ర(టోటల్) | 0.38 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 1.15 cr (షేర్) |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.25 cr |
| ఓవర్సీస్ | 0.38 cr |
| వరల్డ్ వైడ్(టోటల్) | 1.78 cr (షేర్) |
‘కామ్రేడ్ కళ్యాణ్’ చిత్రానికి రూ.8 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.8.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమా రూ.1.78 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.3.3 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.6.72 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.