Mahesh , Trivikram: అలా రిలీజ్ చేద్దామంటే మహేష్ ఒప్పుకోవడం లేదా?

  • August 23, 2022 / 07:26 PM IST

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతుందా? లేదా? అనే ప్రశ్న ఫ్యాన్స్ ను తెగ కన్ఫ్యూజ్ చేస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయవద్దని మహేష్ చెబుతుంటే దర్శకనిర్మాతలు మాత్రం పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేద్దామని చెప్పారని సమాచారం. షూటింగ్ పూర్తైన తర్వాత ఈ సినిమా రిలీజ్ విషయంలో పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

భారీ బడ్జెట్ తోనే హారిక హాసిని క్రియేషన్స్ నిర్మాతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాజమౌళి సినిమాతోనే పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని మహేష్ భావిస్తున్నారు. త్రివిక్రమ్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ సినిమా అంచనాలను అందుకోకపోతే ఎలా అని మహేష్ భావిస్తున్నారు. ఒక విధంగా మహేష్ బాబు తీసుకున్న నిర్ణయం కూడా సరైనదే అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహేష్ కు గతంలో స్పైడర్ సినిమాతో చేదు ఫలితం ఎదురైంది.

భారీ అంచనాలతో తమిళంలో కూడా ఈ సినిమా రిలీజ్ కాగా తమిళంలో ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదనే సంగతి తెలిసిందే. ఈ రీజన్స్ వల్లే మహేష్ తర్వాత సినిమాల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీకి హిట్ టాక్ వస్తే ఆ తర్వాత హిందీలో రిలీజ్ చేస్తే బాగుంటుందని మరి కొందరు భావిస్తున్నారు.

మహేష్ కు జోడీగా పూజా హెగ్డే ఈ సినిమాలో నటిస్తుండగా థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. సినిమాసినిమాకు మహేష్ బాబుకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. మహర్షి తర్వాత మహేష్ పూజా హెగ్డే కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus