అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ కథపై అనుమానాలు

తెలుగు దర్శకులు కొంతమంది ఇతర భాష చిత్రాల ప్రభావంతో కథలను అల్లుతున్నారు. అలా కొత్తగా రాసుకునేటప్పుడు.. ఆ చిత్రాన్ని తెరకెక్కించేటప్పుడు ఫలానా చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకున్నామని చెప్పకుండా.. సొంతకథ అని చెబుతుండడంతో.. ప్రతి కథపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అజ్ఞాతవాసి సినిమా తర్వాత ఈ అనుమానాలు పెరిగాయి. అఖిల్, హలో చిత్రాల తర్వాత అఖిల్ చేస్తున్న మిస్టర్ మజ్ను కథ పైనా అనుమానాలు తలెత్తాయి. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ ప్రస్తుతం లండన్లో షూటింగ్ జరుపుకుంటోంది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు. దేవదాస్ మనవడో.. మన్మధుని వారసుడో అంటూ సాంగ్స్ తో స్టార్ అయిన ఈ వీడియో అందరికీ నచ్చింది.

ఈ చిత్రంలో అఖిల్ ప్లే బాయ్ పాత్రను బాగా పోషించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఓ హిందీ సినిమాకు కాపీ అంటూ జోరుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. హిందీలో రణబీర్ కపూర్ హీరోగా నటించిన “బచ్నా ఏ హసీనా సినిమా”కు ఇది కాపీ అని చెప్పుకుంటున్నారు. మరి దీనిపై వెంకీ ఏమంటారో చూడాలి. బీవీఎన్ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఫస్ట్ లుక్ తో క్రేజ్ పెంచుకున్న ఈ చిత్రం డిసెంబర్ లో రిలీజ్ కానుంది. ఈ చిత్రంతో అఖిల్ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంటారని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus