ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి మూవీపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తోంది. ఓవర్సీస్ లో అడ్వాన్స్ సేల్స్ విషయంలో కల్కి ట్రైలర్ సంచలనాలు సృష్టిస్తోంది. కల్కి తెలుగు వెర్షన్ ట్రైలర్ కు దాదాపుగా 21 మిలియన్ల వ్యూస్ రావడం గమనార్హం. అయితే ఈ సినిమా ట్రైలర్ లోని విజువల్ విషయంలో కాపీ ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తన ఆర్ట్ ను కల్కి సినిమాలో కాపీ కొట్టారంటూ ఒక వ్యక్తి కల్కి యూనిట్ పై విమర్శలు చేశారు. హాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాలకు పని చేసిన సంగ్ చై అనే సౌత్ కొరియాకు చెందిన చెందిన వ్యక్తి కాన్సెప్ట్ డిజైనర్ గా పని చేస్తున్నారు. సంగ్ చై సోషల్ మీడియా వేదికగా కల్కి యూనిట్ తన ఆర్ట్ ను కాపీ కొట్టిందంటూ ఆధారాలను సైతం పొందుపరుస్తూ ఆరోపణలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు.
పది సంవత్సరాల క్రితం యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన విజువల్ ను కల్కి ట్రైలర్ స్టార్టింగ్ లో వచ్చే విజువల్ షాట్ ను ఆ వ్యక్తి అప్ లోడ్ చేశారు. అదే సమయంలో ఒకరు ఎంతో కష్టపడి తయారు చేసిన ఆర్ట్ ను దొంగలించడం అనైతికం అని సంగ్ చై పేర్కొన్నారు. రెండు విజువల్ షాట్స్ చూసిన నెటిజన్లు కాపీ ఆరోపణలు చేయడంలో తప్పేం లేదని రెండు విజువల్స్ దాదాపుగా ఒకే విధంగా ఉన్నాయని చెబుతున్నారు.
సంగ్ చై అనైతికం అంటూ చేసిన క్యాప్షన్ ను తర్వాత తొలగించి కల్కి సినిమా, వైజయంతీ మూవీస్ అంటూ హ్యాష్ ట్యాగ్ లను జోడించారు. ఈ కామెంట్లపై కల్కి మేకర్స్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది. ఈ వివాదం ఇక్కడితో ఆగిపోతుందో లేక మరింత పెద్దదవుతుందో తెలియాల్సి ఉంది. నెటిజన్లలో చాలామంది సంగ్ చైకు సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.