‘జైలర్’ సినిమా గురించి ఎక్కడో చిన్న ‘బీస్ట్’ అనుమానం ఉన్న రజనీకాంత్ ఫ్యాన్స్‌ను ఒక్కసారిగా యాక్టివేట్ చేసింది ఆ సినిమా ట్రైలర్. రజనీకాంత్‌ను చాలా యాక్టివ్‌గా, కొత్తగా చూపించిన ఆ సినిమా ట్రైలర్ చూశాక.. ఫ్యాన్స్ హ్యాపీగా ఉంటే.. కొందరు మాత్రం ఇది కాపీ సినిమా అంటూ మరక అంటించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో రజనీ ఫ్యాన్స్ మళ్లీ తలలు పట్టుకుంటున్నారు. కాపీ కొడితే తప్పు లేదు కానీ.. ఎందుకు రజనీకి కాపీ కథ అనేది వారి మాట.
రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కాంబినేషన్లో సిద్ధమైన ‘జైలర్’ (Jailer) ఈ నెల 10న విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదల చేశారు. అందులో రజినీకాంత్ సాదాసీదా జీవితాన్ని గడిపే రిటైరైన పోలీసు అధికారిగా కనిపిస్తాడు. అయితే తనవరకు వచ్చేసరికి విలన్లను భరతం పట్టడానికి వైల్డ్ అయిపోతాడు. ఈ క్రమంలో రజినీ కాంత్ స్టయిల్ కొత్తగా ఉంది. అయితే ఈ సినిమా ఒక హాలీవుడ్ సినిమాకు కాపీ అనే కామెంట్స్ వస్తున్నాయి. కరోనా సమయంలో హాలీవుడ్‌లో విడుదలైన ‘నోబడీ’ అనే సినిమాకు ఈ సినిమా కథ దగ్గరగా ఉంది అంటున్నారు.
‘నోబడీ’ సినిమాలో పెళ్లాం బిడ్డలతో సాధారణ జీవితం గడిపే హీరో రష్యన్ మాఫియాతో తలపడాల్సి వస్తుంది. ఈ సినిమానే కొద్దిపాటి మార్పులతో ‘జైలర్’ అని చేశారంటూ తమిళ సినిమా పరిశ్రమలో ప్రచారం జరుగుతోంది. అయితే ఓ ట్రైలర్ చూసి ఫలానా సినిమాకు కాపీ అనడం సరికాదనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. దీంతో అసలు విషయం తెలియాలంటే మరో వారం ఆగితే సరిపోతుంది.
‘‘ఈ వ్యాధి వచ్చిన వారు తొలుత పిల్లిలా ఉంటారు. కానీ ఒక్కసారిగా పులిలా మారుతారు’’ అంటూ రజినీని ఉద్దేశించిన డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభించారు. ఆ వెంటనే ‘‘ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలు ఉండవు కోతలే’’ రజనీ ఉగ్ర రూపంలోకి వస్తాడు. ఫైనల్గా ‘టైగర్‌గా హుకుం’ అంటూ రజినీ డైలాగ్‍తో ట్రైలర్‌ను ముగించారు.
ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!
‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?