ఆ విషయం గురించి అయితే నాకు ఫోన్ చెయ్యకండి : ఝాన్సీ

Advertisement

కరోనా వైరస్ ఇప్పుడు దేశం మొత్తాన్ని తెగ వణికించేస్తోంది.సామాన్యులను మాత్రమే కాదు సినిమా వాళ్ళను, బుల్లితెర నటులను కూడా ఈ మహమ్మారి వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే ప్రభాకర్, హరికృష్ణ, నవ్య స్వామి, ‘బిగ్ బాస్3’ రవి కృష్ణ వంటి వారికి కరోనా సోకిందన్న సంగతి తెలిసిందే. ఇక నిర్మాత బండ్ల గణేష్ కూడా భారిన పడ్డారు. నిర్మాత పోకూరి రామరావు కూడా ఇటీవల కరోనాతో మరణించిన సంగతి కూడా అందరికీ తెలిసిందే.

అయితే మరికొంత మంది సెలబ్రిటీలకు కూడా కరోనా సోకిందని అసత్యపు ప్రచారం జరుగుతోంది. యాంకర్ కమ్ డైరెక్టర్ అయిన ఓంకార్, ఫిలిం క్రిటిక్ మరియు నటుడు అయిన కత్తి మహేష్ వంటి వారికి కరోనా సోకిందంటూ ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలను వారు ఖండించారు. తాజాగా యాంకర్ ఝాన్సీకి కూడా క‌రోనా సోకిందంటూ ప్రచారం జరుగుతుంది. ఆమె హోస్ట్‌గా గా వ్యవహరిస్తున్న ‘పరివార్ సీజన్ 2’ ప్రోగ్రామ్ షూటింగ్ లో భాగంగా కరోనా ఉన్న వారితో కలిసి పని చేయడం వల్ల ఝాన్సీకి కరోనా సోకిందని ప్రచారం జరుగుతుంది.

అయితే ఈ వార్తలను ఆమె ఖండించింది. ‘నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. నా ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాలని ఫోన్లు చేసిన వారందరికీ థాంక్స్.అయితే గాసిప్స్ గురించి మాట్లాడటానికి మాత్రం నాకు ఫోన్ చెయ్యొద్దు’ అంటూ చెప్పుకొచ్చింది ఝాన్సీ.

Most Recommended Video

భానుమతి & రామకృష్ణ సినిమా రివ్యూ & రేటింగ్!
సినిమాల్లోకి రాకముందు మన హీరోయిన్స్ ఎలా ఉంటారో చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..!
అట్టర్ ఫ్లాప్ సీజన్ అంటే ఇదేనేమో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus