కళ్యాణ్ రామ్ ‘ఇజం’లోనూ కోర్ట్ సీన్..

తెలుగు చిత్రసీమలో హీరోలను సరికొత్తగా ఆవిష్కరించాలన్నా, తెరపై వారు శక్తివంతంగా కనబడాలన్నా వారికి పూరి జగన్నాధ్ సాయం కావలసిందే. పదమూడేళ్లుగా కళ్యాణ్ రామ్ ని తెరమీద చూస్తూనే ఉన్నాం. ఏనాడన్నా అతడు సిక్స్ ప్యాక్ చేస్తాడని గానీ, ఇంతటి టఫ్ రోల్ లో చూస్తామని గానీ అనుకున్న ప్రేక్షకుడు ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు. టైటిల్, కళ్యాణ్ రామ్ లుక్ కలిసి ఈ సినిమాపై అంచనాలను పెంచాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి మరో విషయం ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. అదే కోర్ట్ సీన్.

మొన్న జరిగిన ‘ఇజం’ ఆడియో వేడుకలో కోర్ట్ సీన్ లన్నీ నందమూరి హీరోల ఖాతాలోనే ఉన్నాయని దర్శకడు పూరి అన్నాడు. నిజమే సీనియర్ ఎన్టీఆర్ నటించిన బొబ్బిలిపులి, పాపరాయిడు సినిమాల్లో కోర్ట్ సీన్ లు అప్పట్లో ఫేమస్. ఇక జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘రాఖీ’లో కోర్ట్ సీన్ గురించి తెలిసిందే. ఇవన్నీ ఒక ఎత్తయితే పూరి-ఎన్టీఆర్ కలయికలో వచ్చిన ‘టెంపర్’ కోర్ట్ సీన్ మరో ఎత్తు. సినిమాలో మేజర్ హైలైట్ కోర్ట్ సీన్ అని ఎవరినడిగినా చెబుతారు. ఇప్పుడు ఓ సామాజికాంశంతో తెరకెక్కిన ‘ఇజం’ లోను ఈ కోర్ట్ సీన్ సంచలనం కానుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్ కూడా ఈ సీన్ చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడట. ‘ఇజం’ కోర్ట్ సీన్ లో కళ్యాణ్ రామ్ వాదన ఏమిటన్నది మరి కొద్దిరోజుల్లో తెలియనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus