నవరసాల “నట”విశ్వరూపం

ఎన్టీఆర్ అనే పధం తెలుగు చలన చిత్ర పరిశ్రమకే కాదు…యావత్ తెలుగు వారికి అదొక ఆభరణం. అయితే ఆయన తరువాత టాలీవుడ్ లో ఆయన వారసులుగా చక్రం తిప్పుతున్న వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్…అలియాస్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఇప్పుడున్న తరం హీరోల్లో పాత్ర ఏదైన…ఎంత కష్టమైన…నటించి మెప్పించగల ఏకైక హీరో జూనియర్ ఎన్టీఆర్. ఇక మాస్ ఫాలోయింగ్ విషయంలో ఎన్టీఆర్ క్రేజ్ ను కొట్టే హీరో ఎవ్వరూ లేరు అంటే అతిశయోక్తి కాదు. తారక రాముని ఆశీసులే కాకుండా, రక్తం, రూపం సైతం పంచుకున్న ఈ యువ హీరో అతి చిన్న వయసులోనే ప్రభంజనాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారాడు. దాదాపుగా 17ఏళ్ళకే బాలరామాయణం సినిమాతో తెలుగు తెరపై నట విశ్వరూపాన్ని ఆవిష్కరించిన ఈ యాంగ్ డైనమిక్ హీరో, కాలక్రమేణా తన ఇమేజ్ ను పెంచుకుంటూ, తనకంటూ ఇండస్ట్రీలో పదిలమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక దాదాపుగా 25సినిమాలు చేసిన ఎన్టీఆర్ ఇప్పటివరకూ తన కరియర్ లో నవరసాలూ పండించేసాడు…ఎన్టీఆర్ నవరస నట విశ్వరూపాన్ని…ఆ రూపంతో నిండిన పాత్రల్ని ఒక లుక్ వేద్దాం రండి.

1.హాస్యరసం

నవ రసాల్లో అన్నింటికన్నా కష్టం అయ్యింది, క్లిష్టం అయ్యింది హాస్య రసం. అలాంటిది ‘అధుర్స్’ సినిమాలో ఎన్టీఆర్ పండించిన హాస్యం నభూతే న భవిష్యత్ అంటే అతిశయోక్తి కాదు.

2.కరుణ రసం

రాఖీ సినిమాలో ఎన్టీఆర్ చెల్లెలిపై చూపించిన ప్రేమానురాగాలకు యావత్ ప్రేక్షక లోకం బ్రహ్మరధం పట్టింది. ఆ చిత్రంలో చెల్లెలి మరణం సమయంలో ఆయన నటన చూసి కన్నీరు పెట్టని వారు ఉండరేమో. అంతలా జీవించాడు యంగ్ టైగర్.

3.రౌధ్రం

నందమూరి వంశం అంటేనే…పౌరుషానికి పెట్టింది పేరు. ఇక అలాంటి వంశంలో పుట్టి రౌధ్రం చూపించడం అంటే, పసి వయసులోనే పులి పిల్లతో ఆడుకున్నంత సులభం. మరి ఆది సినిమాలో ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా.

4.అద్భుత రసం

అవును ఎన్టీఆర్ ‘ఒక్కడే’ అనడానికి ఈ అద్భుత రసమే కారణం. యమదొంగ చిత్రంలో యాముడి పాత్రలో ఆయన నటించిన తీరు..అజరామరం, ఒక్క మాటలో చెప్పాలి అంటే “అద్భుతం…మహాఅద్భుతం”. బహుశా ఆయన తప్పా ఆ పాత్రకు మరెవ్వరూ ఆస్థాయిలో న్యాయం చెయ్యలేరేమో అన్న భావన అందరికీ కలుగుతుంది.

5.శృంగార రసం

బాల రాముడు, భైరవ వీరుడే కాదు…చిలిపి కృష్ణుడు కూడా…అన్ని రసాలు పండించ గలిగితేనే కదా గొప్పతనం. ఇక శృంగార రసంలో కూడా మన యువ హీరో దుమ్ము దులిపేసాడు. నరసింహుడు లో ‘ఏలుకో నాయకా’, నా అల్లుడు లో ‘పట్టుకో పట్టుకో నన్ను పట్టుకో’వంటి పాటలు ఎన్టీఆర్ లో మరో కోణాన్ని బయటకు తీసాయి.

6.భయానక రసం

నందమూరి వంశం అంటేనే భయానికి మీనింగ్ తెలియని ఫ్యామిలీ అలాంటిది ఎన్టీఆర్ భయపడటం ఏంటి అంటారా….అదంతా తెరపైన పాత్రలోనే..భయపెట్టడం మాత్రమే కాకుండా, సంధర్బాన్ని బట్టి భయపడతాడు కూడా అని ఊసరవెల్లి సినిమాలో కొన్ని సీన్స్ చెబుతున్నాయి.

7.వీర రసం

ఇక వీరత్వం చూపించడంలో ఎన్టీఆర్ విశ్వ రూపం చూపిస్తాడు. అతి చిన్న వయసులోనే రికార్డుల మోత మోగించిన ‘సింహాద్రి’ సినిమా గుర్తు ఉంది కదా. ఆ సినిమాలో ఆయన యాక్షన్, ముఖ్యంగా ఇంటర్వల్ సీన్ లో ఆయన నట విశ్వరూపం తలచుకుంటేనే రోమాలు నిక్కపొడుస్తాయి.

8.శాంతి రసం

ఎన్టీఆర్ ఇప్పటివరకూ అన్ని రకమైన పాత్రలను నటించాడు. అయితే అందులో బృంధావనం చిత్రంలో ఆయన నటించిన సాఫ్ట్ క్యారెక్టర్, అంతేకాకుండా అందులో “సాఫ్ట్ గా లవర్ బోయ్ లా కనిపిస్తున్నాడు…అనుకుంటున్నావా లోపల ఒరిజినల్ అలానే ఉంది’ క్యారెక్టర్ కొత్తగా ఉంది అని ట్రై చేసా” అన్న డైలాగ్ అభిమానులే కాదు, ప్రేక్షకులు కూడా ఎప్పటికీ మరచిపోలేరు.

9.భీబత్స రస

టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ చూపించిన భీబత్స రసాన్ని ఎవ్వరూ మరచిపోలేరు. ముఖ్యంగా కోర్ట్ సీన్ లో ఆయన నటన మరోసారి పెద్దాయ్యన్ని గుర్తు చేసింది అంటే అతిశయోక్తి కాదేమో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus