‘ఆర్.ఆర్.ఆర్’ నుండీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఆకర్షించే అప్డేట్..!

‘బాహుబలి'(సిరీస్) తరువాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.అల్లూరి సీతారామరాజు మరియు కొమరం భీమ్ వంటి వీరుల జీవితంలో చోటు చేసుకున్న కొన్ని కీలక అంశాలను తీసుకుని, ఫిక్షనల్ మూవీగా రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో అల్లూరి సీతా రామరాజుగా చరణ్ అలాగే కొమరం భీం గా ఎన్టీఆర్ కనిపించబోతున్నారు.

ఇప్పటికే చరణ్ పాత్రకు సంబంధించిన టీజర్ విడుదలయ్యి… ఎన్నో రికార్డులు కూడా క్రియేట్ చేసింది. అయితే ఎన్టీఆర్ టీజర్ మాత్రం కరోనా కారణంగా ఆలస్యంగా రాబోతుంది. అక్టోబర్ 22 న భీమ్ టీజర్ విడుదల కానున్నట్టు దర్శకనిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అందుతున్న సమాచారం ప్రకారం… భీమ్ టీజర్ కు సంబంధించిన పనులు చాలా వరకూ పూర్తయ్యాయట. డైలాగ్స్ తో కలిపి వీడియో కూడా రెడీ అయిపోయిందని వినికిడి. ఎటొచ్చి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం రెడీ కావాల్సి ఉందట..!

సంగీత దర్శకుడు కీరవాణి ఆ పనిలోనే బిజీగా గడుపుతున్నట్టు తెలుస్తుంది. ట్యూన్ సెలక్షన్ వర్క్ ఎప్పుడో రెడీ అయిపోయిందట. లాక్ డౌన్ టైంలోనే రాజమౌళి ఆ పనిని పూర్తిచేసేసాడట. ప్రస్తుతం ఆడియో మిక్సింగ్ వర్క్ మాత్రమే జరుగుతుందని సమాచారం.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus