Ravindra Jadeja , Allu Arjun: ఖాళీ దొరికితే బన్నీ సినిమాలు చూస్తా.. రవీంద్ర జడేజా కామెంట్స్ వైరల్!

Advertisement

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను (Allu Arjun) ఎంతోమంది అభిమానిస్తారు. బన్నీ డ్యాన్స్, లుక్స్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎలాంటి రోల్ లో నటించినా ఒదిగిపోవడం బన్నీ ప్రత్యేకత అనే సంగతి తెలిసిందే. ప్రముఖ క్రికెటర్ రవీంద్ర జడేజా బన్నీ గొప్పదనం గురించి చెబుతూ కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. జడేజా బన్నీని ఇంతలా అభిమానిస్తారా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పుష్ప (Pushpa) సినిమా చూసిన తర్వాత నేను బన్నీ అభిమానిగా మారిపోయానని ఆయన అన్నారు.

పుష్పలో బన్నీ లుక్ ను కూడా నేను కాపీ కొట్టానని ఆయన చెప్పుకొచ్చారు. ఆ లుక్ లో దిగిన కొన్ని ఫోటోలను నేను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా ఆ ఫోటోలను సంబంధించి బన్నీ రిప్లై ఇవ్వడం జరిగిందని రవీంద్ర జడేజా పేర్కొన్నారు. నేను హిందీలో పుష్ప మూవీ చూశా కానీ తెలుగు డైలాగ్స్ పాపులర్ అయ్యాయని ఆయన తెలిపారు. పుష్ప డైలాగ్స్ తో నేను చాలా రీల్స్ చేశానని రవీంద్ర జడేజా వెల్లడించడం గమనార్హం.

ఖాళీ సమయం దొరికితే బన్నీ నటించిన సినిమాలన్నీ వరుసగా చూస్తానని రవీంద్ర జడేజా వెల్లడించడం గమనార్హం. సినిమా సినిమాకు బన్నీ ట్రాన్స్ ఫార్మేషన్ చూస్తే నాకు ఆశ్చర్యం వేసిందని ఆయన అన్నారు. ఈ విషయంలో బన్నీ గ్రేట్ అని ఫ్యాన్స్ సైతం చెబుతున్నారు. పుష్ప2 (Pushpa2) సినిమా కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని రవీంద్ర జడేజా చెప్పుకొచ్చారు.

పుష్ప ది రూల్ నుంచి విడుదలైన సెకండ్ సింగిల్ కు సైతం మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సాంగ్ కాపీ అని కొంతమంది కామెంట్లు చేస్తున్నా ఆ కామెంట్లలో నిజం లేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పుష్ప ది రూల్ బడ్జెట్ పరంగా టాప్ మూవీ కాగా ఈ సినిమా కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టించాలని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus