Gangavva: గంగవ్వ కోసం కోట్లు ఖరీదు చేసే క్యారవాన్.. ఇదీ గంగవ్వ రేంజ్!

  • July 13, 2022 / 05:15 PM IST

గంగవ్వ ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు.ఏ విధమైనటువంటి లోకజ్ఞానం లేకుండా కనీస విద్యార్హత లేకుండా ఉన్నటువంటి గంగవ్వ ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఈమెలో ఉన్న టాలెంట్ గుర్తించిన కొందరు కుర్రాళ్ళు ఈమె చేత పలు వీడియోలు చేయించి వాటిని యూట్యూబ్లో అప్లోడ్ చేసేవాళ్లు. అయితే గంగవ్వ వీడియోలకు విపరీతమైన పాపులారిటీ రావడంతో ఏకంగా మై విలేజ్ షో అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు. ఈ విధంగా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలను షేర్ చేయడంతో గంగవ్వకు విపరీతమైన పాపులారిటీ వచ్చింది.

చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు గంగవ్వకు అభిమానులుగా మారిపోయారు.ఇక ఈమెకు వచ్చిన ఈ పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని ఏకంగా బిగ్ బాస్ అవకాశాన్ని కూడా అందుకుంది. అలాగే నెట్ ఫ్లిక్స్ లో కూడా మై విలేజ్ షో అంటూ గంగవ్వ టాక్ షో ప్రసారం అవుతుంది. ఈ విధంగా గంగవ్వ రోజు రోజుకు విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకుంది. ఉండటానికి కనీసం సొంతిల్లు కూడా లేని స్థాయి నుంచి గంగవ్వ నేడు సెలబ్రిటీ స్థాయికి ఎదిగిపోయారు.

ఈమెకు ఉండటానికి ఇల్లు లేదని తెలియగానే నాగార్జున తన ఇంటికి సహాయం చేశారు. అయితే గత కొద్ది రోజుల క్రితం గంగవ్వ నూతన గృహప్రవేశం కూడా చేశారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె వరస సినిమా షూటింగులతో కూడా బిజీగా ఉన్నారు. సాధారణంగా షూటింగ్ సమయంలో స్టార్ సెలబ్రిటీలకు మాత్రమే క్యారవాన్ సదుపాయం ఉంటుంది.సినిమా ఇండస్ట్రీలో ఓ మోస్తారు సెలబ్రిటీలకు ఎలాంటి కేరవాన్ సదుపాయం ఉండదు.

కానీ గంగవ్వకు మాత్రం నిర్మాతలు కోట్లు విలువచేసే క్యారవాన్ ను ఏర్పాటు చేశారంటే ఈమె రేంజ్ ఏంటో మనకు అర్థం అవుతుంది. ఈ క్రమంలోనే గంగవ్వ క్యారవాన్ అనుభూతులను ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక వీడియో రూపంలో షేర్ చేశారు. ఏది ఏమైనా ఒక పల్లెటూరులో ఉన్న గంగవ్వ రోజు రోజుకు పాపులారీటీ సొంతం చేసుకొని నేడు సెలబ్రిటీల స్థాయికి చేరుకొని ఎంతోమందికి ఆదర్శంగా ఉన్నారని చెప్పాలి.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus