Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Reviews » Dakshina Review in Telugu: దక్షిణ సినిమా రివ్యూ & రేటింగ్!

Dakshina Review in Telugu: దక్షిణ సినిమా రివ్యూ & రేటింగ్!

  • October 4, 2024 / 03:32 PM ISTByFilmy Focus
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Dakshina Review in Telugu: దక్షిణ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • NA (Hero)
  • సాయి ధన్సిక (Heroine)
  • రిషవ్ బసు, స్నేహ సింగ్, కరుణ భూషణ్,మేఘా చౌదరి, నవీన్ దోసపాటి (Cast)
  • 'ఓషో' తులసీరామ్ (Director)
  • అశోక్ కుమార్ షిండే (Producer)
  • డి.ఎస్.ఆర్ బాలాజీ (Music)
  • ఆర్.కె.శానాపతి (Cinematography)
  • Release Date : అక్టోబర్ 04, 2024
  • కల్ట్ కాన్సెప్ట్స్ (Banner)

‘కబాలి’ సినిమాలో రజినీకాంత్ కూతురిగా నటించిన సాయి ధన్సికని తెలుగు ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోలేరు. దాని తర్వాత కూడా తమిళంలో రూపొందిన పలు సినిమాల్లో ఆమె నటించింది. ఈ మధ్య తెలుగులో కూడా ఆమె సినిమాలు చేస్తుంది. ‘షికారు’ ‘అంతిమ తీర్పు’ వంటి స్ట్రైట్ తెలుగు సినిమాల్లో సాయి ధన్సిక నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన మరో చిత్రం ‘దక్షిణ’ కూడా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఛార్మితో ‘మంత్ర’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన తులసీరామ్ ఈ చిత్రానికి దర్శకుడు. టీజర్, ట్రైలర్స్ లో వయొలెన్స్ ఎక్కువగా కనిపించింది. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు వర్కౌట్ అయితే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన సందర్భాలు అనేకం. మరి వాటి స్థాయిలో ఈ ‘దక్షిణ’ ఉందో లేదో తెలుసుకుందాం రండి :

Dakshina Review

కథ: దక్షిణ(సాయి ధన్సిక) ఏసీపీగా పనిచేస్తూ ఉంటుంది. అయితే సిటీలో సీరియల్ కిల్లింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఓ సైకో.. కొంతమంది అమ్మాయిలను టార్గెట్ చేసి.. వాళ్ళని కిరాతకంగా హతమార్చి వారి తల, మొండాలను వేరు చేస్తుంటాడు. అదే క్రమంలో వాళ్ళ తలలను బ్యాగులో పెట్టుకుని తీసుకుపోతుంటాడు. ఇక ఈ కేసుని దర్యాప్తు చేయడానికి సాయి ధన్సిక రంగంలోకి దిగుతుంది. ఈ నేపథ్యంలో ఆమె దర్యాప్తు చేసిన విషయాలు ప్రజలకి తెలిపేందుకు ఓ ప్రెస్ మీట్..ను నిర్వహిస్తుంది. ‘ఆ సైకో అమ్మాయిలను కిరాతకంగా చంపుతున్నాడు కానీ.. వాళ్ళని మానభంగం చేయడం లేదు, బహుశా అతను ఇంపొటెంట్ అయ్యుండొచ్చు’ అంటూ చెబుతుంది.

దీంతో ఆ సైకో అహం దెబ్బ తిని.. ఒకరోజు దక్షిణ ఇంటికి వచ్చి.. ఆమెకు మత్తు మందు ఇచ్చి.. ఆమెను రేప్ చేస్తూ వీడియో తీసి మీడియాకి లీక్ చేస్తాడు. దీంతో దక్షిణ మానసికంగా కుంగిపోయి.. తన ఉద్యోగానికి రాజీనామా చేసి సిగరెట్లు, మందు వంటి వాటికి బానిసైపోతుంది. అయితే ఆ సైకో ఎవరు? ఎందుకు అమ్మాయిల తలల్ని నరికేసి తనతో పాటు తీసుకు వెళ్తుంటాడు? అతని గతం ఏంటి? అనేది మిగిలిన కథ .

నటీనటుల పనితీరు: సాయి ధన్సిక ఎప్పటిలానే ప్రామిసింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. రెండు రకాల గెటప్..లు ఈమెకు బాగా సెట్ అయ్యాయి. యాక్షన్ సన్నివేశాల్లో కూడా బాగా చేసింది. మిగిలిన నటీనటుల్లో సీరియల్ నటి కరుణ భూషణ్ గెస్ట్ రోల్లో కనిపిస్తుంది.మరో పోలీస్ గా స్నేహ సింగ్ పర్వాలేదు.

మేఘన చౌదరి కూడా గెస్ట్ రోల్ అని చెప్పాలి. రిషవ్ బసు పాత్ర గురించి ఎక్కువ రివీల్ చేయలేము. ఉన్నంతలో అతను బాగానే చేశాడు.మిగిలిన నటీనటులు పర్వాలేదు.

సాంకేతిక నిపుణుల పనితీరు: ‘మంత్ర’ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని తులసీరామ్ చేసిన మూవీ ఇది. ‘మంత్ర’ సినిమా ఇప్పటికీ ఓ కొత్త థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ కలిగిస్తుంది. అయితే ఈ ‘దక్షిణ’ దాని స్థాయిలో లేదు కానీ ఎంగేజ్ అయితే చేస్తుంది. నటీనటుల ఎంపిక విషయంలో డైరెక్టర్ కి మంచి మార్కులే పడతాయి. అయితే కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాయి. సైకో క్యారెక్టర్ కి పెట్టిన ఫ్లాష్ బ్యాక్ బాగానే ఉంది. కానీ అతను స్పెసిఫిక్..గా ఆ అమ్మాయిలనే టార్గెట్ చేయడం వెనుక కారణం ఏంటి అనేది చెప్పలేదు.

అయితే క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ బాగుంటుంది. తల, మొండెం వేరయ్యే విజువల్స్ చాలా భయానకంగా అనిపిస్తాయి.అందుకు సినిమాటోగ్రఫర్ ఆర్.కె.శానాపతిని మెచ్చుకోవాల్సిందే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. నిర్మాణ విలువలు.. ప్రొడక్షన్ డిజైన్ బాగానే ఉన్నాయి. నిడివి 1 గంట 45 నిమిషాల లోపే ఉండటం ఇంకో ప్లస్ పాయింట్ గా చెప్పాలి.

విశ్లేషణ: ‘దక్షిణ’…అక్కడక్కడ ఆకట్టుకునే క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఓటీటీలో థ్రిల్లర్ సినిమాలు చూసే వారికి ఇది మంచి ఛాయిస్ గా చెప్పుకోవచ్చు.

రేటింగ్ : 2.25/5

Rating

2.25
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dakshina
  • #sai dhanshika

Reviews

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

trending news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

1 hour ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

3 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

10 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

15 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

16 hours ago

latest news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

13 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

17 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

17 hours ago
Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

1 day ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version