Dakshina Review in Telugu: దక్షిణ సినిమా రివ్యూ & రేటింగ్!

  • October 4, 2024 / 03:32 PM IST

Cast & Crew

  • NA (Hero)
  • సాయి ధన్సిక (Heroine)
  • రిషవ్ బసు, స్నేహ సింగ్, కరుణ భూషణ్,మేఘా చౌదరి, నవీన్ దోసపాటి (Cast)
  • 'ఓషో' తులసీరామ్ (Director)
  • అశోక్ కుమార్ షిండే (Producer)
  • డి.ఎస్.ఆర్ బాలాజీ (Music)
  • ఆర్.కె.శానాపతి (Cinematography)

‘కబాలి’ సినిమాలో రజినీకాంత్ కూతురిగా నటించిన సాయి ధన్సికని తెలుగు ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోలేరు. దాని తర్వాత కూడా తమిళంలో రూపొందిన పలు సినిమాల్లో ఆమె నటించింది. ఈ మధ్య తెలుగులో కూడా ఆమె సినిమాలు చేస్తుంది. ‘షికారు’ ‘అంతిమ తీర్పు’ వంటి స్ట్రైట్ తెలుగు సినిమాల్లో సాయి ధన్సిక నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన మరో చిత్రం ‘దక్షిణ’ కూడా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఛార్మితో ‘మంత్ర’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన తులసీరామ్ ఈ చిత్రానికి దర్శకుడు. టీజర్, ట్రైలర్స్ లో వయొలెన్స్ ఎక్కువగా కనిపించింది. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు వర్కౌట్ అయితే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన సందర్భాలు అనేకం. మరి వాటి స్థాయిలో ఈ ‘దక్షిణ’ ఉందో లేదో తెలుసుకుందాం రండి :

Dakshina Review

కథ: దక్షిణ(సాయి ధన్సిక) ఏసీపీగా పనిచేస్తూ ఉంటుంది. అయితే సిటీలో సీరియల్ కిల్లింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఓ సైకో.. కొంతమంది అమ్మాయిలను టార్గెట్ చేసి.. వాళ్ళని కిరాతకంగా హతమార్చి వారి తల, మొండాలను వేరు చేస్తుంటాడు. అదే క్రమంలో వాళ్ళ తలలను బ్యాగులో పెట్టుకుని తీసుకుపోతుంటాడు. ఇక ఈ కేసుని దర్యాప్తు చేయడానికి సాయి ధన్సిక రంగంలోకి దిగుతుంది. ఈ నేపథ్యంలో ఆమె దర్యాప్తు చేసిన విషయాలు ప్రజలకి తెలిపేందుకు ఓ ప్రెస్ మీట్..ను నిర్వహిస్తుంది. ‘ఆ సైకో అమ్మాయిలను కిరాతకంగా చంపుతున్నాడు కానీ.. వాళ్ళని మానభంగం చేయడం లేదు, బహుశా అతను ఇంపొటెంట్ అయ్యుండొచ్చు’ అంటూ చెబుతుంది.

దీంతో ఆ సైకో అహం దెబ్బ తిని.. ఒకరోజు దక్షిణ ఇంటికి వచ్చి.. ఆమెకు మత్తు మందు ఇచ్చి.. ఆమెను రేప్ చేస్తూ వీడియో తీసి మీడియాకి లీక్ చేస్తాడు. దీంతో దక్షిణ మానసికంగా కుంగిపోయి.. తన ఉద్యోగానికి రాజీనామా చేసి సిగరెట్లు, మందు వంటి వాటికి బానిసైపోతుంది. అయితే ఆ సైకో ఎవరు? ఎందుకు అమ్మాయిల తలల్ని నరికేసి తనతో పాటు తీసుకు వెళ్తుంటాడు? అతని గతం ఏంటి? అనేది మిగిలిన కథ .

నటీనటుల పనితీరు: సాయి ధన్సిక ఎప్పటిలానే ప్రామిసింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. రెండు రకాల గెటప్..లు ఈమెకు బాగా సెట్ అయ్యాయి. యాక్షన్ సన్నివేశాల్లో కూడా బాగా చేసింది. కాకపోతే ఈమె పాత్రకు సరైన ఎలివేషన్స్ పడలేదు. దీంతో సాదా సీదాగానే ఈమె పాత్ర కనిపిస్తుంది. వాస్తవానికి సాయి ధన్సికని మినహాయిస్తే ఇందులో తెలిసిన నటీనటులు ఎక్కువగా ఉండరు. కరుణ భూషణ్ ఒక సీన్లో కనిపించి మాయమవుతుంది. రిషవ్ బసు పర్వాలేదు అనిపిస్తాడు.

సాంకేతిక నిపుణుల పనితీరు: సినిమా మొదలైనప్పటి నుండి అందరి మైండ్లో ఓ ప్రశ్న మెదులుతూ ఉంటుంది. అదేంటి అంటే.. ‘నిజంగా ఇది ‘మంత్ర’ సినిమా తీసిన తులసీరామే డైరెక్ట్ చేశాడా?’ అని..! ఎందుకంటే ‘మంత్ర’ సినిమా ఇప్పుడు చూసినా చాలా కొత్తగా.. ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. కానీ ఈ ‘దక్షిణ’ సినిమా .. ఓపెనింగ్ సీన్ నుండి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతూనే ఉంటుంది. ఒక్క సన్నివేశం కూడా ఆసక్తికరంగా ఉండదు. అలాగే ఒక సీన్ కి మరో సీన్ కి కనెక్టివిటీ మిస్ అవుతుంది. సహజంగా.. క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో సైకోలకు ఓ మోటివ్ ఉంటుంది. వాళ్ళు అందరినీ చంపరు.

ఏదో ఒక విషయంలో హర్ట్ చేసిన వాళ్ళను.. లేదు అంటే అలాంటి గుణాలను కలిగిన వాళ్ళని చంపుతూ ఉంటారు. ఈ సినిమాలో సైకోకి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూపించారు కానీ.. అతను ఏ ఉద్దేశంతో అమ్మాయిలను కిడ్నాప్ చేసి చంపుతున్నాడు? తల, మొండెం ఎందుకు వేరు చేసి తీసుకుపోతున్నాడు? అనే విషయాలకి క్లారిటీ ఇవ్వలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ చాలా మైనస్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఇంపాక్ట్ చూపలేదు. నిర్మాణ విలువలు పర్వాలేదు. సినిమాకి ఉన్న ఏకైక ప్లస్ పాయింట్.. నిడివి 1 గంట 45 నిమిషాల లోపే ఉండటం అని చెప్పాలి.

విశ్లేషణ: ‘దక్షిణ’… ఆకట్టుకునే అంశాలు అంటూ ఏమీ లేని ఓ లాజిక్ లెస్ క్రైమ్ థ్రిల్లర్. థియేటర్లోనే కాదు ఓటీటీలో కూడా ఈ సినిమాని చూడటం కష్టమే.

రేటింగ్ : 1.5/5

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus