“1 నేనొక్కడినే” స్టోరీ సీక్రెట్ రివీల్ చేసిన సుకుమార్!
- May 23, 2017 / 01:48 PM ISTByFilmy Focus
మహేష్ బాబు ప్రయోగాత్మకంగా చేసిన “1 నేనొక్కడినే” ఆర్ధికంగా నష్టాన్ని చవిచూసినప్పటికీ.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దర్శకుడు సుకుమార్ ప్రతిభని సినీ ప్రముఖులు మెచ్చుకున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఓ సీక్రెట్ బయటకు వచ్చింది. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లో తెరకెక్కిన ‘దర్శకుడు’ టీజర్ ప్రారంభోత్సవ వేడుకలో సుకుమార్ “1 నేనొక్కడినే” స్టోరీ సీక్రెట్ ను రివీల్ చేశారు. “దర్శకుడు సినిమాకు దర్శకత్వం వహించిన జక్కా హరి ప్రసాదే ‘1 నేనొక్కడినే’ కథకు మూల రచయిత, ఆయన రాసిన కథనే నేను డెవలప్ చేసాను” అని తెలిపారు.
దీంతో అక్కడ ఉన్నవారంతా హరి ప్రసాద్ కి చప్పట్లతో అభినందనలు తెలిపారు. ముఖ్యంగా సుకుమార్ కథ అందించిన వ్యక్తిని మీడియా ముందూ చెప్పి శెభాష్ అనిపించుకున్నారు. ఇక దర్శకుడు’ సినిమా గురించి మాట్లాడుతూ “ఈ సినిమా కోసం ఒక్క రోజు కూడా సెట్స్ కు వెళ్ళలేదు. ఇటీవలే సినిమా చూశాను. చాలా బాగా వచ్చింది. ఒక దర్శకుడు కావాలన్నా వ్యక్తి ప్రేమలో పడి అదా, ఇదా? అన్న కోణంలో ఈ చిత్ర కథ చాలా తమాషాగా ఉంటుంది” అని సుకుమార్ వెల్లడించారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















