విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ హీరో, హీరోయిన్లుగా ‘పాగల్’ తర్వాత రూపొందిన మూవీ ‘దాస్ క ధమ్కీ’. ‘వన్మయే క్రియేషన్స్’ ‘విశ్వక్ సేన్ సినిమాస్’ బ్యానర్లపై కరాటే రాజు, విశ్వక్ సేన్ లు కలిసి ఈ చిత్రాన్ని రూ.20 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.విశ్వక్ సేన్ కెరీర్లో ఇది భారీ బడ్జెట్ మూవీ అని చెప్పాలి. లియోన్ జేమ్స్, రామ్ మిర్యాల సంగీతంలో రూపొందిన ఈ చిత్రంలోని పాటలకు మంచి స్పందన లభించింది.
టీజర్, ట్రైలర్ లు బాగానే ఉండటంతో మార్చ్ 22న ఉగాది కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి డీసెంట్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
నైజాం
0.90 cr
సీడెడ్
0.41 cr
ఉత్తరాంధ్ర
0.40 cr
ఈస్ట్
0.30 cr
వెస్ట్
0.20 cr
గుంటూరు
0.37 cr
కృష్ణా
0.22 cr
నెల్లూరు
0.15 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
2.95 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.38 cr
ఓవర్సీస్
0.62 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
3.95 cr (షేర్
‘దాస్ క ధమ్కీ’ చిత్రానికి రూ.7.58 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.7.9 కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటిరోజు ఈ చిత్రం రూ.3.95 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఇంకో రూ.3.95 కోట్ల షేర్ ను రాబట్టాలి. నిన్న ఉగాది సెలవుని ఈ మూవీ బాగా క్యాష్ చేసుకుంది. మరి వీకెండ్ వరకు క్యాష్ స్టడీగా కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ లు పుష్కలంగా ఉన్నాయి.