చైతూ, సమంతల మూవీ షూటింగ్ తేదీ ఫిక్స్!

యువ సామ్రాట్ నాగచైతన్య సవ్యసాచి సినిమాని కంప్లీట్ చేసి.. మారుతి దర్శకత్వంలో శైలజ రెడ్డి అల్లుడు సినిమా చేస్తున్నారు. దీని తర్వాత మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాదు.. ఆ ప్రాజక్ట్ ని పట్టాలెక్కించనున్నారు. “నిన్నుకోరి” హిట్ తో మంచి పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ దర్శకత్వంలో నటించనున్నారు. హరీశ్ పెద్ది, సాహు గారపాటి కలిసి నిర్మిస్తోన్న ఈ సినిమాలో నాగచైతన్య సరసన సమంత హీరోయిన్ గా నటించనుంది. పెళ్ళికి ముందు ఈ జంట “ఏ మాయ చేశావే”, “ఆటో నగర్ సూర్య”, “మనం ” చిత్రాల్లో నటించింది. పెళ్లి తర్వాత తొలిసారి చేస్తున్న సినిమా ఇదే. అందుకే ఉమ్మడిగా ఏడుకోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్టు సమాచారం.

మరో విశేషం ఏమిటంటే ఇందులో భార్య భర్తలుగానే కనిపించనున్నారు. తొలి సన్నివేశంలోనే పెళ్లి అయిపోతుందని చైతు స్పష్టం చేశారు. అయితే సినిమాలో పెళ్లి తర్వాత వీరి మధ్యలోకి ఓ అమ్మాయి వస్తుందని.. ఆమె వల్ల ఇద్దరు ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. ఆ పాత్రను ఓ హీరోయిన్ పోషించనున్నట్లు తెలిసింది. ఈ సినిమా సోమవారం(జులై 23 ) నుంచి మొదలుకాబోతోంది. హైదరాబాద్ లో ప్రారంభంకానున్న ఈ షెడ్యూల్లో సమంత, చైతూతో పాటు రావు రమేష్, అవసరాల శ్రీనివాస్ తదితరులు పాల్గొననున్నారు. గోపి సుందర్ సంగీతమందిస్తున్న ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ మెప్పు అందుకుంటుందని చిత్ర బృందం ఆశిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus