Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

‘నా గురించి ఇంతకుముందు రౌడీలకు బాగా తెలుసు.. మీ కుర్ర గూన్స్‌కి తెలియదు’ అంటూ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాలో చిరంజీవి నోట దర్శకరచయిత అనిల్‌ రావిపూడి ఓ మాట చెప్పించారు. ఆ డైలాగ్‌ ఆ సీన్‌కి బాగా యాప్ట్ అయింది. దీనిని ఎవరూ కాదనలేరు. అలాగే నిజ జీవితంలో చిరంజీవి (Chiranjeevi) విషయంలో ‘తొక్కడు’ కామెంట్స్‌ చేసేవారికి ‘కామ్రేడ్‌ కల్యాణ్‌’ సినిమా విషయంలో జరిగిన అంశం గురించి తెలియాలి.

Chiranjeevi

‘కామ్రేడ్‌ కల్యాణ్‌’ సినిమా విషయంలో బయట చాలా మందికి తెలియని విషయాన్ని ఆ సినిమా సమర్పకుడు కోన వెంకట్‌ ఇటీవల చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి తాజా రుజువు అంటూ తమ సినిమా విషయంలో జరిగిన అంశాన్ని ప్రస్తావించారు. ‘కామ్రేడ్ కల్యాణ్’ సినిమాకు సెన్సార్ బోర్డు దగ్గర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ సినిమాలో మరికొన్ని మూవీ రెఫరెన్సులు ఉండటం, నక్సలిజం ప్రస్తావన ఉండటం లాంటి వాటితో సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడంలో జాప్యం జరిగింది.

ఈ మేరకు ఢిల్లీలోని సెన్సార్‌ రివైజింగ్ కమిటీ వరకు సినిమాను వెళ్లినప్పుడు చిరంజీవి (Chiranjeevi) సాయపడ్డారట. ఈ సినిమా గురించి సెన్సార్‌ వారి దగ్గరకు మరోసారి వెళ్లినప్పుడు ఈ సినిమాను ఇంతగా ఎందుకు శల్య పరీక్ష చేస్తున్నారు అని ఒక పెద్ద మనిషిలా ఆయన మాట చెప్పడం వల్ల స్మూత్‌గా సెన్సార్ బోర్డు దగ్గరి నుండి బయటకు వచ్చాం అని కోన వెంకట్‌ చెప్పారు. ఈ సినిమాలో చిరంజీవి ‘ఆచార్య’ ప్రస్తావన ఉంది. ఆ డిజాస్టర్‌ సినిమాను మళ్లీ ప్రస్తావించి.. పాత గాయం రేపడం ఎందుకు అని చిరంజీవి అనుకోలేదు.

ఒక చిన్న సినిమాకు సాయంగా ఓ మాట చెబుదాం అనుకున్నారు. అదే తొక్కేసే చిరంజీవి అయి ఉంటే.. ‘నా సినిమాను అలా ప్రస్తావించి.. నన్ను బాధపెడతారా’ అని అనుకునేవారు. అన్నట్లు ఆ ‘ఆచార్య దళం’ డైలాగ్‌ కూడా చిరంజీవికి ముందే తెలుసట. ఆ డైలాగ్‌ విని.. ఈ మాట సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది అని కూడా చెప్పారట. ఈ విషయాలు శ్రీవిష్ణు చెప్పారు.

ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

 

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus