Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Reviews » Dear Review in Telugu: డియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dear Review in Telugu: డియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • April 12, 2024 / 02:57 PM ISTByFilmy Focus
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Dear Review in Telugu: డియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • జి వి ప్రకాష్ కుమార్ (Hero)
  • ఐశ్వర్య రాజేష్ (Heroine)
  • కాళి వెంకట్, ఇళవరసు, రోహిణి, తలైవాసల్ విజయ్, గీతా కైలాసం, నందిని తదితరులు (Cast)
  • ఆనంద్ రవిచంద్రన్ (Director)
  • వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి పృథ్వీరాజ్ (Producer)
  • జి వి ప్రకాష్ కుమార్ (Music)
  • జగదీష్ సుందరమూర్తి (Cinematography)
  • Release Date : ఏప్రిల్ 12, 2024
  • నట్‌మెగ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ (Banner)

ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల్లో ‘డియర్’ కూడా ఒకటి. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ (G. V. Prakash Kumar) హీరోగా చేసిన ఈ మూవీలో టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించడం వల్ల కొంతమంది ప్రేక్షకుల దృష్టి ఈ సినిమా పై పడింది. మరి సినిమా వారిని ఆకట్టుకునే విధంగా ఉందో లేదో ఓ లుక్కేద్దాం రండి :

కథ: చిన్న చిన్న కారణాలకు విడాకులు తీసుకుంటున్న వార్తలు మనం ప్రతిరోజూ వింటూనే ఉన్నాం. అలాంటి వాటి ఆధారంగానే ఈ సినిమా రూపొందింది. విషయం ఏంటంటే.. అర్జున్ (జీవీ ప్రకాష్ కుమార్) ఓ న్యూస్ రీడర్. అతను రోజూ టీవీలో కనిపించాలి. కాబట్టి…ముఖం ఫ్రెష్ గా ఉండాలని ప్రతి రోజూ 8 గంటలు పడుకోవాలని అతను డిసైడ్ అవుతాడు. అతను సెటిల్ అయ్యాడు అని భావించి ఇంట్లో వాళ్ళు అతనికి దీపిక (ఐశ్వర్య రాజేష్) అనే అమ్మాయితో పెళ్లి జరిపిస్తారు. దీపికకి నిద్రపోతే గురక గట్టిగా పెట్టే బలహీనత ఉంటుంది. దీంతో అర్జున్ కి అది భారంగా మారుతుంది. ఈ క్రమంలో వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు. ఒకరు ఒక నైట్ అంతా పడుకుంటే ఇంకొకరు మెలకువగా ఉండాలి.

అయితే ఓసారి అర్జున్ కి ఓ ముఖ్యమైన వ్యక్తిని ఇంటర్వ్యూ చేసే అవకాశం వస్తుంది. అయితే దానికి ముందు రోజు నైట్ అంతా అతను నిద్ర పోడు. తన భార్యతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగం అనమాట. అయితే తర్వాతి రోజు ఆఫీస్ లో ఇంటర్వ్యూ చేసే టైంకి బాత్రూమ్ లో నిద్రపోతాడు.దీంతో అతని పరువు, ఉద్యోగం రెండూ పోతాయి. దీనికి కారణం అతని భార్య అని భావించి ఆమెకు విడాకులు ఇవ్వాలనే కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు. ఓ పక్క అమ్మ (రోహిణి), అన్నయ్య (కాళి వెంకట్) సర్ది చెప్పినా వినడు. విడాకుల కేసు కోర్టులో ఉండగా దీపిక ప్రెగ్నెంట్ అవుతుంది. ఆ తర్వాత ఏమైంది అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు: సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా కూడా మరికొన్ని హిట్లు కొట్టాడు. అయితే ఈ సినిమాలో అతని నటన ఎవ్వరికీ కనెక్ట్ అవ్వదు. ఎందుకంటే చాలా వరకు కామెడీ పండించే స్కోప్ ఆ పాత్రకి ఉన్నా జీవీ ప్రకాష్ దానిని వాడుకోలేకపోయాడు. అది డైరెక్షన్ లోపం అని కూడా ఇక్కడ చెప్పవచ్చు. ఇక హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ ఎంత టాలెంటెడో అందరికీ తెలుసు. కానీ ఆమె టాలెంట్ కి తగ్గ రోల్ అయితే కాదు ఇది.

అందుకే ఆమె సాదా సీదాగా కనిపిస్తుంది. హీరో తల్లిగా చేసిన రోహిణి తన మార్క్ నటనతో కాసేపు ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. హీరో అన్నయ్యగా కాళీ వెంకట్ కొన్ని చోట్ల నవ్వించే ప్రయత్నం చేశాడు. మిగిలిన నటీనటులు ఎవ్వరూ రిజిస్టర్ కారు.

సాంకేతిక నిపుణుల పనితీరు: ముందుగా ఇది షార్ట్ ఫిలింకి సెట్ అయ్యే కథ. అయినప్పటికీ దర్శకుడు ఆనంద్ రవిచంద్రన్ 2 గంటల 15 నిమిషాల సినిమాగా ఆవిష్కరించాలి అనుకున్నాడు. చిన్న చిన్న విషయాలకి కొంతమంది ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు అనే పాయింట్ మంచిదే. కానీ కామెడీకి బోలెడంత స్కోప్ ఉంది. చాలా ఎంటర్టైనింగ్ గా ఈ కథని చెప్పే అవకాశం ఉంది. కానీ దర్శకుడు ప్రతి సన్నివేశాన్ని ‘టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్’ అనే పద్ధతిలో తీశాడు. అదే పెద్ద మైనస్ అయ్యింది.

మొత్తంగా డైరెక్షన్ పై కంప్లైంట్స్ ఎక్కువగా ఉన్నాయి. అయితే మ్యూజిక్ పరంగా ఓకే. ఒక పాట బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఓకే. జీవీ ప్రకాష్ కి ఇక్కడ మంచి మార్కులు వేయొచ్చు. మరోపక్క సినిమాటోగ్రఫీ కూడా ఓకే. రెండు పాటలు రిచ్ గా కనిపించాయి. నిర్మాణ విలువల విషయంలో కంప్లైంట్ చేయలేము. కథకు తగ్గట్టు బాగానే నిర్మాతలు ఖర్చు చేశారు.

విశ్లేషణ: దర్శకుడు మంచి పాయింట్ తీసుకున్నప్పటికీ.. ఆసక్తికరమైన కథ, కథనాలు లేకపోవడం వల్ల ‘డియర్’ బాగా బోర్ కొట్టిస్తుంది. రన్ టైం తక్కువే అయినప్పటికీ.. అంతసేపు ప్రేక్షకుడిని కుర్చీలో కూర్చోపెట్టే విధంగా అయితే ఈ సినిమా లేదు.

రేటింగ్ : 1.5/5

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rajesh
  • #Anand Ravichandran
  • #Dear
  • #GV Prakash Kumar

Reviews

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

20 mins ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

1 hour ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

8 hours ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

1 day ago

latest news

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

7 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

1 day ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

1 day ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

1 day ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version